»   » అల్లు అర్జున్ రూట్ లోనే మంచు విష్ణు ప్రయాణం

అల్లు అర్జున్ రూట్ లోనే మంచు విష్ణు ప్రయాణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుపతి : దూసుకెళ్తా.. చిత్రం అందరికీ నచ్చిందని, ఈ అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని సినీ హీరో మంచు విష్ణువర్ధన్‌ అన్నారు. మంచు విష్ణు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉదయం ప్రారంభ దర్శనంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ 'దూసుకెళ్తా' చిత్రం విజయం సాధించడంతో స్వామివారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చినట్లు చెప్పారు. తన తండ్రి మోహన్‌బాబు, తమ్ముడు మనోజ్‌లతో కలిసి నటిస్తున్న చిత్రం డిసెంబరు చివర్లో లేక జనవరి మొదట్లో విడుదలవుతుందని తెలిపారు. . తమిళంలో విడుదల కాకపోయినా అభిమానుల కోరికమేరకు 'దూసుకెళ్తా' చిత్రాన్ని నవంబర్-8న మలయాళంలో విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

స్థానిక భూమా సినీ కాంప్లెక్స్‌లోని జగత్‌ థియేటర్‌కు వచ్చిన ఆయన ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర విజయానికి కారకులైన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాణం దాదాపు తిరుపతి పరిసరాల్లో జరిగిందన్నారు. నాపై, నా కుటుంబ సభ్యులపైన మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరారు. అభిమానులు నాపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని.. ఢీ, దేనికైనారెడీ, దూసుకెళ్తా.. చిత్రాలకు తగ్గని చిత్రాల్లో నటిస్తానని హామీ
ఇచ్చారు. అంతకుముందు థియేటర్‌ వద్ద మంచు విష్ణు, మనోజ్‌ యువసేన రాష్ట్ర నాయకులు ఎం.సునీల్‌చక్రవర్తి, స్థానిక నాయకులు మౌళి, కుమార్‌, ప్రమోద్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం మంచు విష్ణుకు శాలువకప్పి గజమాలతో సత్కరించారు.

ఇక తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఇద్దరు సినీనటులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో సినీనటుడు మంచు విష్ణుబాబు, నటి శ్రీదేవి వేర్వేరుగా పాల్గొన్నారు. శ్రీదేవి మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. స్వామి దర్శనం సంతృప్తికరంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. నటులను చూడటానికి భక్తులు, అభిమానులు పోటీపడ్డారు.

English summary
Telugu actor Vishnu Manchu now wants to impress Malayalam audiences a with his latest film 'Doosukeltha' will be dubbed in the language. Produced by Vishnu's father M Mohan Babu under his banner 24 Frames Factory,
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu