»   » కామెడీతో....( 'దూసుకెళ్తా' ప్రివ్యూ)

కామెడీతో....( 'దూసుకెళ్తా' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్ : బ్రహ్మానందం, మంచు విష్ణు కాంబినేషన్ అంటే అందరికీ ఢీ గుర్తుకు వస్తుంది. మళ్లీ అలాంటి కామెడీ కథతోనే దూసుకెళ్తా వస్తోంది. ట్రైలర్స్ చూసిన వారంతా ఖచ్చితంగా సినిమా హిట్ కొడతారంటున్నారు. అందులోనూ దర్శకుడు వీరు పోట్ల గతంలో తీసిన బిందాస్, రగడ విజయవంతం కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మంచు విష్ణు మాట్లాడుతూ... దూసుకెళ్తా కూడా ఈ చిత్రంపై కథను నేను సంపూర్ణంగా వినలేదు. మనోజ్ విని చెప్పాడు. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఇష్టపడి చేశాను. కొంతమంది సన్నిహితులకు సినిమాను ప్రదర్శించాం. అందరూ ఏకధాటిగా బావుందని మెచ్చుకున్నారు. ఫస్ట్ కాపీ చూసిన రోజు కంటినిండా నిద్రపట్టింది. ఇందులో తమ్ముడు మనోజ్ నటించలేదు కానీ, అక్కని అడగ్గానే చేసింది. అది సినిమాకు ప్లస్ అవుతుంది. బ్రహ్మానందంగారితో నా కాం బినేషన్ ఈ సినిమాలో ఇంకా బాగా వర్కవుట్ అవుతుంది. పి చ్చేశ్వర్‌గా వెన్నెలకిశోర్ చాలా బాగా చేశాడు. వీరుపోట్ల డైలాగులు విన్న తర్వాత ఇంకెవరి డైలాగులూ నచ్చడం లేదు అన్నారు.

తన క్యారెక్టర్ గురించి చెప్తూ... "ఈ సినిమాలో నా పాత్రకు దూసుకెళ్తే తత్వం ఉంటుంది. కానీ అన్నిటికీ కండిషన్స్ అప్లై అని అంటుంటాను. ఈసినిమా వల్ల ఇంకో పదేళ్లు నేను పరిశ్రమలో దూసుకెళ్తాననిపిస్తోంది. ఈ సినిమా తొలికాపీ వచ్చాక చాలా తక్కువ మంది సన్నిహితులం కూర్చుని సినిమా చూశాం. సినిమాలో ఫైట్లో నాకు గాయాలవడం చూసి మా పిల్లలిద్దరూ ఏడ్చేశారు. కానీ సినిమా అంతా చూసిన తర్వాత అందరూ భరోసా ఇవ్వడంతో నేను కంటినిండా నిద్రపోయాను.'' అని చెప్పుకొచ్చారు.

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.... ''తొలి సినిమా 'అందాల రాక్షసి'తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను. రెండో సినిమా అనేసరికి ఎలాంటి కథని ఎంచుకోవాలని ఆలోచనలో పడ్డాను. అయితే తొలిసినిమాకి భిన్నంగా ఉండాలి అని మాత్రం అనిపించింది. అలా నేను ఎంచుకున్న సినిమానే ఈ 'దూసుకెళ్తా'. డాక్టర్‌ అలేఖ్యగా మీ ముందుకుకొస్తున్నాను'' అన్నారు .

వీరు పోట్ల మీడియాతో మాట్లాడుతూ ''రవితేజ గళంతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇందులో విష్ణు పాత్రికేయుడిగా కనిపిస్తారు''అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో రవితేజ గళం వినిపిస్తుంది. ఇందులో కథానాయకుడి పాత్ర చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. అవి ఆద్యంతం సరదాగా సాగుతాయట. ఆ సన్నివేశాలకి రవితేజ గళాన్ని అందించారు.

బ్యానర్‌: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
నటీనటులు:మంచు విష్ణు వర్ధన్, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు
ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి,
కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,
సమర్పణ: ఆరియానా, వివియానా.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆర్.విజయకుమార్
నిర్మాత : మంచు మోహన్‌బాబు
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వీరూ పోట్ల

English summary
Much-awaited Telugu film Doosukeltha starring Vishnu Manchu and Lavanya Tripathi in the leads is all set to hit the screens on October 17. The movie will be released with English subtitles in the International markets like UAE, Australia, USA and Singapore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu