»   » మంచు విష్ణు యాక్షన్ పార్ట్ చూసి ఆడియన్స్ స్టన్ అవుతారు

మంచు విష్ణు యాక్షన్ పార్ట్ చూసి ఆడియన్స్ స్టన్ అవుతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘డైనమైట్'. దేవాకట్టా దర్శకుడు . అచ్చు సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియో మంచి స్పందన రాబట్టుకుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

విడుదలకు ముందే సినీ అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మంచు విష్ణు, డైనమైట్ వంటి యాక్షన్ ఎంటర్టెనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసి ఆశ్చర్యానికి లోనవడం గ్యారంటీ అని అంటున్నారు ఫైట్ మాస్టర్ విజయన్.

 Vishnu Manchu's Knock-out Actions in Dynamite will Stun you - Stunt Director Vijayan

ఇటీవల డైనమైట్ ఆడియో వేడుకలో పాల్గొన్న ఫైట్ మాస్టర్ విజయన్, తను ఇప్పటి వరకు పనిచేసిన వారిలో మంచు విష్ణు టాప్ మోస్ట్ యాక్షన్ హీరో అని చెప్పుకొచ్చారు. యాక్షన్ ఎంటర్ టైనింగ్ మూవీస్ ను ఇష్టపడే ప్రేక్షకులకు మంచు విష్ణు రూపొందించిన డైనమైట్ తప్పకుండా నచ్చే సినిమాగా నిలుస్తుంది. మంచు విష్ణు చేసిన పెర్ ఫార్మెన్స్, రిస్కీ ఫైట్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయన్నారు.

కొన్ని సన్నివేశాలు ఇప్పటి వరకు సెల్యూలాయిడ్ పై చిత్రీకరించిన రీతిలో తెరకెక్కించబడ్డాయి. విష్ణు ఎనర్జీ లెవల్స్ చూసి ఆశ్చర్యపోయాను. అంతే కాకుండా ఒక సన్నివేశంలో చెయ్యి విరిగిపోయినా బెస్ట్ అవుట్ పుట్ వరకు తను నటిస్తూనే ఉన్నాడని ఆ సిచ్యువేషన్ చూసి చాలా ఆశ్చర్యపోయానని ఫైట్ మాస్టర్ విజయన్ తెలియజేశారు.

English summary
If audiences watch Vishnu Manchu's ready to release ‘Dynamite’ action scenes, they would certainly get amazed, says Vijayan the Stunt Master of the film, who is know for his demanding stunt choreography.
Please Wait while comments are loading...