»   »  ‘డైనమైట్’ లా పేలనున్న మంచు విష్ణు

‘డైనమైట్’ లా పేలనున్న మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మంచు విష్ణు తాజా చితానికి ‘డైనమైట్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. దేవకట్టా దర్శకత్వంలో రూపొందే చిత్రం ఇది. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేసారు. ఈ టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో , సినిమా కూడా అంతే పవర్ తో ఉంటుందని చెప్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూర్తి వివరాల్లోకి వెళితే...

మంచు విష్ణు నటిస్తూ దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. తమిళం సినిమా ‘అరిమ నంబి'కి రీమేకిది. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొంది. ఇందులో విష్ణు డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారట.

కథానుగుణంగా హీరో కొత్త లుక్‌లో కనిపిస్తే బాగుంటుందని దర్శకుడు విష్ణుకి తెలియజేయడం, సినిమాలో తన పాత్ర, లుక్‌ విభిన్నంగాఉండాలనుకుని విష్ణు ఇందుకు అంగీకరించారట. విష్ణు లుక్‌కి స్పందన బావుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Vishnu Manchu's Next a 'DYNAMITE' Entertainer

‘వెన్నెల', ‘ప్రస్థానం', ‘ఆటోనగర్ సూర్య' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మరియు విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ దేవకట్ట డైరెక్షన్ లో వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్న సంగతి మంకు తెలిసిందే.తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది. ఈ సినిమా కాన్సెప్ట్ తో పాటు, మంచు విష్ణు లుక్ కి సరిపోయేలా ‘డైనమైట్' అనే టైటిల్ ని ఖరారు చేసారు.

ఈ సినిమాలో మంచు విష్ణు టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా ప్రణిత నటిస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి'కి రీమేక్. మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం అనంతరం ...మంచు విష్ణు, అల్లరి నరేష్‌ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకి ‘డమరుకం' ఫేం శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్టు ఫిలింనగర్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు ఇండస్ట్రీకి ‘అత్తరింటికి దారేది' వంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందించిన బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. హీరోయిన్లు ఇంకా ఖరారు కాలేదు.

విష్ణు, నరేష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని సమాచారం. మరి ఈ మల్టీ స్టారర్‌ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి

English summary
Vishnu Manchu and Devakatta film is titled 'Dynamite', the film maker today formally announced the title of their under production film. 'We promise that the film will be a Dynamite entertainer' says the hit Actor-Producer Vishnu Manchu. The title was an irresistible choice.
Please Wait while comments are loading...