For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మా’ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్: గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు.. భలే ప్లాన్ వేశాడుగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'కు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది దీని గురించి పరిశ్రమలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అయితే, ఈ సారి అది ఇంకాస్త ముందుగానే ప్రారంభం అయింది. ప్రస్తుత పాలక వర్గం పని చేస్తూనే ఉన్నా.. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హడావిడి కనిపిస్తోంది. ఇందులో విజయం సాధించేందుకు అప్పుడే పలువురు సినీ ప్రముఖులు పావులు కదుపుతున్నారు. ఇలాంటి సమయంలో పోటీదారుల్లో ఒకరైన మంచు విష్ణు ఓ శుభవార్త చెప్పాడు. ఆ సంగతులు మీకోసం!

  అధ్యక్ష పదవికి పోటీలో ఐదురుగు

  అధ్యక్ష పదవికి పోటీలో ఐదురుగు

  కొంత కాలంగా ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురు ప్రముఖులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు నటీనటులు ఎన్నికల బరిలో నిలిచారు. వారెవరో కాదు చాలా కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తోన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు పోటీ చేస్తున్నారు.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  తప్పుకుంటానని మంచు విష్ణు బైట్

  తప్పుకుంటానని మంచు విష్ణు బైట్

  ‘మా' అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న మంచు విష్ణు కొద్ది రోజుల క్రితం ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' స్థాపించినప్పటి నుంచి ఎన్నో విషయాలను ప్రస్థావించిన అతడు.. మా బిల్డింగ్‌ను కట్టేందుకు డబ్బులు ఇస్తానని చెప్పాడు. అంతకంటే ముందు పెద్దలంతా కలిసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కండీషన్ పెట్టాడు.

  అదే మాట మీద ఉన్న మంచు విష్ణు

  అదే మాట మీద ఉన్న మంచు విష్ణు

  ఇటీవల మంచు విష్ణు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘మా' ఎన్నికల గురించి ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. అంతేకాదు, ఇప్పటికైనా సినీ పెద్దలంతా కలిసి ఏకగ్రీవం చేయడానికి ఒప్పుకుంటే ఎన్నికల నుంచి తప్పుకుంటానని విష్ణు స్పష్టం చేశాడు. అయితే, ఇండస్ట్రీలో బిల్డింగ్ కంటే ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని అతడు పేర్కొన్నాడు.

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న రాశీ ఖన్నా హాట్ సెల్ఫీ: గతంలో చూడని విధంగా అందాల ఆరబోత

  బాలకృష్ణ సహా వాళ్లంతా మద్దుతు

  బాలకృష్ణ సహా వాళ్లంతా మద్దుతు

  ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికలను ఏకగ్రీవం చేయాలన్న మంచు విష్ణు వాదనకు నటసింహా నందమూరి బాలకృష్ణ మద్దతు తెలిపారు. సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టిస్తానని అతడు చెప్పడం హర్షనీయమని అన్నారు. బాలయ్య మాత్రమే కాదు.. ఇండస్ట్రీలోని చాలా మంది సీనియర్ నటులు మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారు. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నాడు.

  శుభవార్త చెప్పిన మంచు వారి హీరో

  శుభవార్త చెప్పిన మంచు వారి హీరో

  ప్రతిసారి జరిగే ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల సమయంలో బిల్డింగ్ విషయం ప్రధానంగా చర్చ అవుతోంది. కానీ, ఆ తర్వాత దానికి సంబంధించిన అంశాన్ని అంతా మర్చిపోతున్నారు. ఇక, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా పోటీదారుల్లో ఒకడైన మంచు విష్ణు.. సినీ కుటుంబానికి ఓ అదిరిపోయే గుడ్ న్యూస్‌ను చెప్పాడు.

  Bheemla Nayak సెట్స్‌లో గన్‌తో పవన్ హల్‌‌చల్: రాయల్‌గా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ.. వీడియో వైరల్

  వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ తెలుగు నటి !

  కల నిజం కాబోతుందని వీడియో

  తాజాగా మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో ‘మా కుటుంబ సభ్యులకు గుడ్ మార్నింగ్. మన మా ఆసోషియేషన్‌కు భవనం ఉండాలని మనందరి కల. ఆ కల త్వరలోనే నిజం కాబోతుంది. నేను స్వయంగా వెళ్లి మూడు స్థలాలను చూశాను. అందులో ఏది బెస్ట్ అనేది మనందరం కూర్చుని డిసైడ్ చేద్దాం. ఈ ఆసక్తికరమై వార్తను మీకు చెప్పాలనే ఈ వీడియోను పెడుతున్నాను.' అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

  English summary
  Tollywood Actor and Producer Vishnu Manchu Shared a Video in Social Media. In This Video.. He Said Good News about MAA Building.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X