»   » తమ్ముడు హీరోయిన్ తో అన్న విష్ణు రొమాన్స్

తమ్ముడు హీరోయిన్ తో అన్న విష్ణు రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మనోజ్ నటిస్తున్న 'ఝుమ్మంది నాదం' చిత్రంలో హీరోయిన్ గా పరిచయమవుతున్న తాప్సీపై అన్న విష్ణువర్ధన్ ‌బాబు కన్ను పడింది. దాంతో ఆమెను తన తాజా చిత్రంలో హీరోయిన్ గా బుక్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని తాప్సి ట్విట్టర్‌ లో కన్ఫర్మ్ చేసింది. ఇక మొదటి చిత్రం సెట్స్ మీద ఉండగానే ప్రభాస్‌, దశరధ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇక 'ఝుమ్మంది నాదం' చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ సంస్థ పతాకంపై లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోంది. ఇక విష్ణు హీరోగా చేస్తున్న చిత్రం షూటింగ్ వేగంగా సిటీ అవుట్ స్కర్ట్స్ లో జరుగుతోంది. హేమంత్ మధుకర్ దర్సకత్వం వహించే ఈ చిత్రం ఓ రొమాంటిక్ ధ్రిల్లర్ తరహాలో ఉండనుందని సమాచారం. విష్ణు తండ్రి మోహన్‌ బాబు నిర్మాతగా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం...మణిశర్మ, కెమెరా...ఎస్‌.గోపాల్ ‌రెడ్డి, కూర్పు...గౌతంరాజు. ఇక హేమంత్ మధుకర్ గతంలో హిందీలో 'ఫ్లాట్' అనే థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu