»   » 2 వేల మందితో విష్ణు ‘డైనమైట్’ యాక్షన్!

2 వేల మందితో విష్ణు ‘డైనమైట్’ యాక్షన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న యంగ్ హీరో మంచు విష్ణు, ‘వెన్నెల', ‘ప్రస్థానం', ‘ఆటోనగర్ సూర్య' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మరియు విమర్శకులను మెప్పించిన దేవకట్టా డైరెక్షన్‌లో రూపొందుతున్న మరో వినూత్నమైన సినిమా ‘డైనమైట్'.

ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ గత నెలలోనే విడుదల చేశారు. మంచి స్పందన వచ్చింది. ‘డైనమైట్' చిత్రం కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన 'అరీమా నంబి' చిత్రానికి రీమేక్. డైనమైట్ చిత్రం కోసం విష్ణు చెవులకు పోగులు, చేతి నిండా టాటూలు వేయించుకుని ఫుల్‌గా గడ్డం పెంచేయడంతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని స్పష్టమవుతోంది.

Vishnu’s Dynamite completes its talkie part

ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం హైద్రాబాద్‌, కోట్ల విజయభాస్కర్‌ స్టేడియంలో జరుగుతోంది. మంచు విష్ణుతోపాటు జె.డి.చక్రవర్తిపై కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు 2000 మంది జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ పాల్గొనగా.. విజయ్‌ మాస్టర్‌ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ‘డైనమైట్‌' టాకీ పార్ట్‌ పూర్తయ్యింది.

ఇటీవల విడుదలైన ‘డైనమైట్‌' వాయిస్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోందని, త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తామని చిత్ర బృందం చెబుతోంది. వేసవి కానుకగా ‘డైనమైట్‌' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో విష్ణు సరసన ప్రణీత నటిస్తోంది.

English summary
Manchu Vishnu and Deva Katta’s action thriller is nearing completion. According to the latest update, the talkie part of the film has been completed. A heavy duty climax fight featuring 2000 junior artists was shot recently.
Please Wait while comments are loading...