»   » మంచు విష్ణు ‘డైనమైట్’ కొత్త రిలీజ్ డేట్

మంచు విష్ణు ‘డైనమైట్’ కొత్త రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విష్ణు నటించిన ‘డైనమైట్' మూవీని బాహుబలి సినిమా విడుదలకు ఒక వారం ముందు... విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు కానీ రిలీజ్ చేయలేక పోయారు. దీంతో జులై మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్ దాదాపు 3 నెలలు వెక్కి వెల్లింది. తాజాగా అందుతున్న సమాచారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

విష్ణు పెర్ ఫార్మెన్స్, లుక్ కి సరిపొయే విధంగా ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు చెవి పోగు, చేతి పొడవునా టాటూతో డిఫరెంట్ లుక్ తో కనువిందు చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుని చేశారు. విష్ణు స‌ర‌స‌న గ్లామ‌ర‌స్ హీరోయిన్ ప్ర‌ణీత హీరోయిన్‌గా న‌టించింది.


Vishnu’s Dynamite releasing on Oct 01

ఇటీవలే రిలీజ్ చేసిన ఈ చిత్ర సాంగ్స్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైనమైట్ లో మంచు విష్ణు ఫుల్ ఇంటెన్స్ పాత్రలో సూపర్బ్ యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ ఆకట్టుకుంటాడని సమాచారం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి'కి రీమేక్.


మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ అందించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్ర‌యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఇటీవల అచ్చు సంగీతం అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలై3న వరల్డ్ వైడ్ గా సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Manchu Vishnu’s upcoming action entertainer, Dynamite has been confirmed to hit the screens on the 1st of October.
Please Wait while comments are loading...