For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Adipurush Teaser: ఆదిపురుష్ టీమ్‌కు మరో షాక్.. రిలీజ్‌ను ఆపేస్తామంటూ ప్రకటన

  |

  సాధారణంగా సినీ రంగంలో ఎన్నో రకాల వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మత విశ్వాసాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితే ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' మూవీ టీమ్ ఎదుర్కొంటోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలైంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు హిందూ మత విశ్వాసాలను అపహాస్యం చేసే విధంగా ఉన్నాయని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే 'ఆదిపురుష్' టీమ్‌కు మరో షాక్ తగిలింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

  ఆదిపురుష్ టీజర్‌పై అసంతృప్తి

  ఆదిపురుష్ టీజర్‌పై అసంతృప్తి

  ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్' నుంచి ఇటీవలే టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో శ్రీరాముడు, హనుమంతుడు, రావణాసురులను చూపించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఇవన్నీ హిందూ మతాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని అభ్యంతరాలు వస్తున్నాయి. దీంతో సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్లు మొదలయ్యాయి.

  టాలీవుడ్ స్టార్ హీరోతో భయానక అనుభవం.. నాలుగో నెల కడుపుతోనే: రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

  విశ్వ హిందూ పరిషత్ స్పందన

  విశ్వ హిందూ పరిషత్ స్పందన

  'ఆదిపురుష్' మూవీ టీజర్‌పై ఇప్పటికే చాలా హిందూ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వివాదంలో 'విశ్వ హిందూ పరిషత్' (VHP) కూడా స్పందించింది. ఈ మేరకు 'ఆదిపురుష్' టీజర్‌లో సన్నివేశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆ సంస్థ సంభాల్ యూనిట్ ప్రచార ప్రముఖ్ అజయ్ శర్మ ప్రకటన వదిలారు.

  విలువలు అపహాస్యం చేశారని

  విలువలు అపహాస్యం చేశారని

  స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' టీజర్‌పై విశ్వ హిందూ పరిషత్ సంభాల్ యూనిట్ ప్రచార ప్రముఖ్ అజయ్ శర్మ స్పందిస్తూ.. 'ఈ టీజర్‌లో శ్రీరాముడు, హనుమంతుడు, రావణాసురులను చూపించిన తీరు హిందూ మత విశ్వాసాలను అపహాస్యం చేసే విధంగా ఉంది. దీన్ని హిందూ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు' అంటూ ఆయన వెల్లడించారు.

  డ్రెస్ సైజ్ తగ్గించిన దీప్తి సునైనా: పైనా కిందా పరువాల ప్రదర్శన

  సెన్సార్ బోర్డు రద్దు చేయాలని

  సెన్సార్ బోర్డు రద్దు చేయాలని

  రామాయంణం నేపథ్యంతో రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీ వివాదం గురించి మాట్లాడుతూ సెన్సార్ బోర్డు తీరును కూడా తప్పుబట్టారు. 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) ఏకపక్షంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుని వెంటనే ఈ బోర్డును రద్దు చేయాలి' అంటూ ఆయన మరో కొత్త డిమాండ్‌ను చేశారు.

  సినిమాను ఆపేస్తామని ప్రకటన

  సినిమాను ఆపేస్తామని ప్రకటన

  ఇక, ఈ వివాదంపై అజయ్ శర్మ ఘాటుగానే స్పందిచడంతో పాటు మరో డిమాండ్‌ను కూడా ఉంచారు. 'ఆదిపురుష్ మూవీలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించకపోతే.. విశ్వ హిందూ పరిషత్ చర్యలు తీసుకుంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలో ఆడకుండా అడ్డుకుంటుంది' అంటూ చెప్పారు. ఆయన ప్రకటనను కొన్ని హిందూ సంస్థలు సపోర్ట్ చేశాయి.

  దీపిక - రణ్‌వీర్ విడాకులు: నగ్నంగా చేసిన పని వల్లే.. హీరోనే స్వయంగా చెప్పడంతో!

  ఆదిపురుష్‌లో ఎవరెవరున్నారు

  ఆదిపురుష్‌లో ఎవరెవరున్నారు


  బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు.

  English summary
  Rebel Star Prabhas Now Doing Adipurush Movie Under Om Raut Direction. Now Vishva Hindu Parishad raised objections on This Movie Teaser.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X