»   » ‘రక్త చరిత్ర’ సెట్ లో తీవ్రంగా గాయపడి ఎమర్జెన్సీవార్డులో ఉన్న నటుడు?

‘రక్త చరిత్ర’ సెట్ లో తీవ్రంగా గాయపడి ఎమర్జెన్సీవార్డులో ఉన్న నటుడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ నటుడు విశ్వజీత్‌ ప్రధాన్‌కు 'రక్తచరిత్ర' షూటింగ్‌లో గాయాలయ్యాయి. స్టంట్‌ సన్నివేశాలు తీస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. చిత్రం క్లైమాక్స్‌లో ఎజాజ్ జావేద్ ఆధ్వర్యంలో విశ్వజీత్‌ ప్రధాన్‌ ఓ బాంబ్‌ బ్లాస్ట్‌ లో చనిపోయే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. బాంబ్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన ముఖానికి గాయాలయ్యాయి. దవడ ఎముక విరిగినట్టు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డ్‌లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం డాక్టర్లు సర్జరీ కూడా నిర్వహించారు. 'పతాక సన్నివేశం తీస్తున్నాం. బాంబ్‌బ్లాస్ట్‌లో నేను చనిపోయినట్టు షాట్‌ తీయాలి. కానీ బాంబ్‌ ప్రేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో నాకు గాయాలయ్యాయి. నా మొహంపై ఆ గాయం మచ్చ ఉంటుందేమోనని ఆయన భార్య సోనాలిక ప్రధాన్ భయపడుతున్నారు. విశ్వజీత్ ప్రధాన్ మరిన్ని చిత్రాల్లో కూడా నటిస్తున్నాడని, ఈ సంఘటన జరిగినప్పుడు రామ్ గోపాల్ వర్మ సెట్ లో లేడని సమాచారమ్.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu