Don't Miss!
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మరో హిట్ కొట్టేయడానికి సిద్ధమైన విశ్వక్సేన్, తమిళ హిట్ మూవీ రీమేక్ పైనే గురి.
మంచి కథలు ఎంపిక చేసుకుంటూ, బాక్సాఫీస్ వద్ద స్టడీగా సాగుతున్న విశ్వక్సేన్, మరో మంచి ప్రాజెక్ట్ లో మమేకమయ్యాడు. తమిళ నాట సూపర్ హిట్ గా నిలిచిన "ఓ మై కదావుళే" చిత్రం తెలుగులో రీమేక్ అవుతుండగా, అందులో హీరో గా విశ్వక్సేన్ కన్ఫామ్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా అబ్బాయే ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.
కొంత కాలం క్రితమే పీవీపీ సినిమాస్ ఓ మై కధావుళే చిత్రం రీమేక్ రైట్స్ కొనుగోలు చేసింది. ఇటీవలే విశ్వక్సేన్ ను హీరోగా ఫైనలైజ్ చేసింది. ఇక పెళ్లి చూపులు, మీకు మాత్రమే చెబుతా వంటి సినిమాల దర్శకుడు, తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగులు అందివ్వనున్నాడని తెలుస్తోంది. ఇక ఒరిజినల్ లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రలో, తెలుగులోనూ అతడినే నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కథ విషయానికి వస్తే, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరిపై మరొకరికి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండానే పెళ్లి చేసుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నది స్టోరీ లైన్. తమ మధ్య సయోధ్య లేదని అర్ధమయ్యాక విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు సెకండ్ ఛాన్స్ లభిస్తే ఏం చేశారు అన్నదే కథలో కీలకమైన పాయింట్.
మరోవైపు, ఓ మై కదావుళే సినిమాపై మహేశ్ బాబు, ప్రసంశల వర్షం కురిపించేస్తున్నాడు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపించిందని ట్వీట్ చేసిన మహేశ్ బాబు, డైరెక్టర్ అశ్వథ్, హీరో అశోక్ సెల్వన్, హీరోయిన్ రితిక నటన అద్భుతంగా ఉందని ప్రసంశించాడు. ఇక సూపర్ స్టార్ ఆశీస్సులే లభించాయి కాబట్టి, రీమేక్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి దీనికి విశ్వక్సేన్ ఎంతవరకూ న్యాయం చేస్తాడో చూడాలి.