»   » నా అతివిశ్వాసం కాదు.. ఆత్మవిశ్వాసం : కమల్‌హాసన్‌

నా అతివిశ్వాసం కాదు.. ఆత్మవిశ్వాసం : కమల్‌హాసన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ''నేను సినిమాలు తీసేది ప్రేక్షకుల కోసం... వారి ఆనందం కోసం. అంతేగానీ ప్రచారం కోసం కాద''న్నారు ప్రముఖ నటులు కమల్‌హాసన్‌. ప్రస్తుతం 'విశ్వరూపం-2' సినిమాని తెరకెక్కించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమాని ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

కమల్‌హాసన్‌ మాట్లాడుతూ... విశ్వరూపం సినిమాకి రెండో భాగం రూపొదించడంలో నేనేమాత్రం తొందరపడలేదు. చాలా మంది సీక్వెల్‌ చేసేందుకు కనీసం ఏడాది వ్యవధి తీసుకొంటారు. నేను మాత్రం 'విశ్వరూపం' మొదలైనప్పటి నుంచీ రెండో భాగం గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. విశ్వరూపం అనేది విస్తృతమైన కథ. అందుకే రెండు భాగాలుగా చేశాను. అయినా ఇది నా అతివిశ్వాసం కాదు.. ఆత్మవిశ్వాసం అన్నారు.

అలాగే ... 'విశ్వరూపం' విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ సినిమాని చూడకుండానే చాలా మంది అడ్డంకులు కలిగించారు. దాని వల్ల విడుదల రెండు వారాలు ఆలస్యమైంది. రెండో భాగంలో ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ఉంటాయి. సాంకేతికపరంగా తొలి భాగం కన్నా ఉన్నత ప్రమాణాలుంటాయి. ఈ సినిమా కోసం నీటి అడుగున కొన్ని సన్నివేశాలు చిత్రించాము అని చెప్పారు.

ఇక ఇప్పటికే ఈ చిత్రంచిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. సాంకేతిక జోడింపులు పూర్తయిన అనంతరం సినిమాను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి భాగం విషయంలో డీటీహెచ్‌ ప్రసార నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కమల్‌ ... రెండో భాగాన్ని మాత్రం ఎలాగైనా డీటీహెచ్‌లలో ప్రసారం చేయాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం. తొలి భాగం ఇచ్చిన అనుభవాలతో ఈ సారి పకడ్బందీగా వ్యవహరిస్తున్నారట. దీనికి సంబంధిచిన వివరాలు కొద్ది రోజుల్లోనే వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీటీహెచ్‌ ప్రదర్శన విషయంలో తన తొలి చిత్రం సమస్యలు ఎదుర్కొన్నా కమల్‌హాసన్‌ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించటం లేదు.

English summary

 Kamal Hassan who is busy with ‘Viswaroopam’ sequel says it is his confidence and not arrogance to come with a sequel. He says the film is both sequel and prequel. Speaking to scribes he said “I don’t make film for publicity; rather, I want my film to be enjoyed by my audience. Generally, people wait for a year and then decide on a film’s sequel. But, I was sure from the beginning that I will bring the second part too. ‘Vishwaroopam II’ is not my arrogance rather it is my confidence,”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X