Just In
- 24 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- News
కన్న కూతుళ్లనే చెరబట్టిన తండ్రి... ఏళ్ల తరబడి అత్యాచారం... హైదరాబాద్‌లో వెలుగుచూసిన దారుణం..
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'విశ్వరూపం-2' విడుదల సమయం ఖరారు
ఇప్పటికే 90శాతం చిత్రీకరణ పూర్తయింది. కొన్ని కీలక సన్నివేశాలను కొడైకానల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15 నాడు తెరపైకి వస్తుందనే వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. దీపావళికి విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనుకున్నదానికంటే షూటింగ్ తొందరగా ముగియటం, నిర్మాణాంతర పనుల్ని కూడా పూర్తి చేసి దీపావళి నాటికి థియేటర్లలోకి తెచ్చేందుకు చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిసింది.
ఈ రెండో భాగంలో కథ చాలా వరకూ మన దేశం నేపథ్యంగానే సాగుతుంది. త్వరలో ఢిల్లీలో కొన్ని ఘట్టాలు చిత్రించబోతున్నారు. 'విశ్వరూపం 2'ని ఆగస్టులో విడుదల చేయాలన్నది కమల్‌హాసన్ ఆలోచన. తొలి భాగంలోని నటీనటులు చాలామంది కొనసాగింపులోనూ నటిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తెరపై 'విశ్వరూపం'లో ఆవిష్కరించారు కమల్‌హాసన్. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన ఆ చిత్రం పలు వివాదాలను సృష్టించింది.
ప్రస్తుతం కమల్ 'విశ్వరూపం 2' చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. దీన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం. ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్ తెలిపారు.
ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు. కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.