twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం'తెలుగు వెర్షన్ ఆడియో విడుదల తేదీ

    By Srikanya
    |

    హైదరాబాద్ : విశ్వనటుడు కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో ఆయనే కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు గానూ ఆడియోని డిసెంబంర్ 9న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ రోజు(డిసెంబ్ర 7)న తమిళ వెర్షన్ ఆడియో ఘనంగా విడుదల అవుతోంది. గబ్బర్ సింగ్ తరహాలో ఒకేసారి మూడు సిటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ ఛార్టెడ్ ప్లైట్ ని వినియోగిస్తున్నారు. చెన్నైలోని వైఎంసీఏ మైదానం వేదిక.

    'విశ్వరూపం'లో తీవ్రవాద నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. కమల్ రెండు వైవిధ్య పాత్రల్లో కనిపించనున్నాడు. జనవరి 11న థియేటర్లలోకి రానుంది. అయితే కమల్ ఈ చిత్రాన్ని విడుదల రోజే టీవీ ఛానెల్స్ కు ఇస్తాననటంతో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి నిరసన మొదలైంది. కమల్ కి,డిస్ట్రిబ్యూటర్స్ కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దాదాపు 50 కోట్లకు కమల్ ఈ చిత్రం టెలివిజన్ రైట్స్ ని అదే రోజు టెలీకాస్ట్ చేసుకునే కండీషన్ తో అమ్మేసారు. అయితే టాటా స్కై,ఎయిర్ టెల్ వంటి డిటెహెచ్ ఛానెల్స్ లో మాత్రమే వస్తుంది. థియోటర్స్ ఓనర్స్ స్ట్రైక్ కు పిలుపు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.

    ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ప్రముఖ దర్శకులు శేఖర్‌ కపూర్‌ ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. కథలో ఆ పాత్ర కీలకమై సినిమాను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు.

    ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా పండిట్‌ బిర్జూ మహారాజ్‌ దగ్గర కథక్‌ నృత్యం నేర్చుకొన్నారు. కథలో ఆ నృత్యం కీలకమని సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఇది తెరకెక్కింది. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూర్చారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాహల్ బోస్ ని విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరిగింది. హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ చిత్రమే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది. పూజా కుమార్‌, రాహుల్‌ బోస్‌, ఆండ్రియా, జైదీప్‌ అహ్లావత్‌ తదితరులు నటించారు. సంగీతం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌, నిర్మాతలు: ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌.

    English summary
    The audio launch of Kamal Hassan's Vishwaroopam Telugu version, we hear may happen on 9th December. On 7th Dec the Tamil audio launch of this film will happen in three different cities of Tamil Nadu, a chartered flight has been booked for the same reason.The film is set for release on Jan 11, 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X