twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vivek Agnihotri:'ది కాశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ సంచలనం.. వ్యాక్సిన్ పై సినిమా, ఆసక్తిగా టైటిల్!

    |

    ఒక చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలై సుమారు రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది ఈ చిత్రం. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ చిత్రానికి డైరెక్టర్ వివేక్ అగ్నిహెత్రి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పేరు మారుమోగిపోయింది. సామాజిక అంశాలను వేలేత్తి చూపి, వాటిని సినిమా రూపంలో తెరకెక్కించే దర్శకుల్లో ఆయన ఒకరు. తాజాగా మరో సోషల్ ఎలిమెంట్ తో ముందుకు రానున్నారు. కరోనా పాండమిక్ తో యావత్ ప్రపంచం ఎలా వణికిపోయిందో తెలిసిందే. కరోనాను అరికట్టే వ్యాక్సిన్ పై వివేక్ అగ్నిహోత్రి సినిమా తెరకెక్కించనున్నారు. ఆ వివరాళ్లోకి వెళితే..

     యావత్ దేశం మొత్తం పాపులర్..

    యావత్ దేశం మొత్తం పాపులర్..

    సామాజిక అంశాలను, అందులోని తప్పొప్పులను తన సినిమాలతో వేలేత్తి మరి చూపే బాలీవుడ్ డైరెక్టర్లలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన ది తాష్కెంట్ ఫైల్స్ అనే సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టారు. అయితే ఆ చిత్రం విజయం సాధించినప్పటికీ వివేక్ పూర్తి స్థాయిలో లైమ్ లైట్ లోకి రాలేదు. కానీ ఈ ఏడాది వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో యావత్ దేశం మొత్తం పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ కేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం విమర్శకులు ప్రంశంసలు అందుకుంది. పలు ప్రభుత్వాలు అయితే వినోదపు పన్ను సైతం మినహాయింపు కల్పించాయి.

    కరోనా రక్కసి కారణంగా..

    కరోనా రక్కసి కారణంగా..

    1990లో కశ్మీర్ పండిట్ లపై జరిగిన సాముహిక హింసాత్మక హత్యకాండ నేపథ్యంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. మౌత్ టాక్ తోనే ఈ సినిమా అంతటి విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే కరోనా రక్కసి కారణంగా యావత్ ప్రపంచం ఎలా వణికిందో తెలిసిందే. కొన్ని దేశాల్లో కరోనా కారణంగా వేల కుటుంబాలు పరిస్థితి దారుణంగా మారింది. అయితే కరోనా సమయంలో మానవాళి ఎదుర్కొన్న విషయాలపై తాజాగా వివేక్ అగ్నిహోత్రి సినిమా తెరకెక్కించనున్నారు. దేశంలో కరోనా ప్రభావం, టీకా తయారీ కోసం పడిన ఇబ్బందులు, వ్యాక్సిన్ కోసం కొనసాగిన పోటీతోపాటు తదితర అంశాలను చూపించనున్నారు.

    ది వ్యాక్సిన్ వార్..

    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఇందులో కరోనా వ్యాక్సిన్ ఉన్న వాయిల్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ విడుదల చేస్తూ ''ది వ్యాక్సిన్ వార్ పరిచయం చేస్తున్నాం. మీకు తెలియని యుద్ధంపై మీరు పోరాడి గెలిచిన అద్భుతమైన కథ. మన భారతీయ గొప్ప విలువలతో పాటు సాహసం, సైన్స్ తో విజయం సాధించాం. ఈ చిత్రం 2023 స్వాతంత్య దినోత్సవం (ఆగస్టు 15) రోజున 11 భాషల్లో విడుదల కానుంది. మమ్మల్ని ఆశీర్వదించండి'' అని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. ది వ్యాక్సిన్ వార్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో ఇంకా నటీనటులు ఎవరనేది ప్రకటించలేదు. ఈ సినిమాను ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో పల్లవి జోషి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్, గుజరాతి, పంజాబీ, భోజ్ పురితోపాటు 11 భాషల్లో విడుదల చేయనుంది.

    English summary
    The Kashmir Files Director Vivek Agnihotri Announces The Vaccine War Movie And Poster Released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X