»   » పరిటాల రవిగా, దొంగగా వివేక్ ఒబరాయ్

పరిటాల రవిగా, దొంగగా వివేక్ ఒబరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న రక్త చరిత్రలో పరిటాల రవిగా చేస్తున్న వివేక్ త్వరలో దొంగగానూ కనిపించనున్నాడు. తాజాగా వివేక్ ఒబరాయ్ హీరోగా చేస్తున్న ప్రిన్స్ చిత్రం హిందీతో పాటు తెలుగు,తమిళ వెర్షన్స్ లోనూ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రియల్ తొమ్మిదిన మూడు భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కుమార్ తరుణి మీడియాకు చెప్పారు. ఇక ఈ చిత్రంలో వివేక్ ఓ ఇంటర్నేషనల్ దొంగగా కనిపిస్తారు. అతను ఓ పెద్ద దొంగతనం చేసి తప్పించుకనే పరిస్ధితుల్లో ఓ తుపాకి గుండు తలకి తగిలి పడిపోతాడు. తెల్లారి మెలకువ వచ్చి చూస్తే అతను ఎవరో గుర్తు ఉండదు. అంతా మర్చిపోయిన అతనికి తన పేరు ప్రిన్స్ అని తెలుస్తుంది. అలాగే సరంగ్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నానని,తన గర్లెప్రెండ్ మాయ అని అర్దమవుతుంది. ఈ సిట్యువేషన్ లో అతన్ని ఇండియన్ సీక్రెట్ సర్వీస్ వారు వెంటాడుతూంటారు. అతన్ని పట్టుకుంటే ఆ దొంగతనం గురించి తెలియటమే కాక మానవ జాతి మొత్తానికి సంభదించిన ఓ ప్రమాదం నుంచి తప్పించవచ్చునని. ఈ పరస్ధితుల్లో ప్రిన్స్ ఎవర్ని నమ్మాలో ...వద్దో అన్న సిట్యువేషన్ లో పడిపోతాడు. అప్పుడు అతనేం చేసాడు..అతను నమ్ముతున్న అతని గర్లెప్రెండ్ నందనా సేన్ పరిస్ధితి ఏమిటన్నది మిగతా కథ. ఇక వివేక్ ఒబరాయ్...రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న రక్త చరిత్ర చిత్రంలో పరిటాల రవి గా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu