»   » హీరో చేసిన పనికి చార్మి షాక్ అయ్యింది

హీరో చేసిన పనికి చార్మి షాక్ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

రక్త చరిత్ర హీరో వివేక్ ఒబరాయ్ రీసెంట్ గా జిల్లా ఘజియాబాద్ సెట్స్ పై కంగారు పెట్టేసారు.ఆమెను పిలిచి మరికొద్ది సేపట్లో ఆమె ఓ విష సర్పం తో కలిసి నటించాల్సి ఉంటుందని చెప్పి ప్రిపేర్ అవ్వమన్నాడు.అసలు చిన్న పురుగుని చూస్తేనే టెన్షన్ పడే ఆమె భయపడిపోయింది.వెంటనే దర్శకుడుని కలిసి ఎలా మేనేజ్ చేస్తారు..ఆ పాముని అని అడిగింది.దాంతో ఆ డైరక్టర్ కి ఏమీ అర్దం కాలేదు.పాముఏమిటి అని అడిగాడు. అప్పుడామె ఇలా వివేక్ ఒబరాయ్ చెప్పాడని చెప్పింది.అప్పుడు డైరక్టర్ నవ్వి అలాంటి సీన్ ఏమి లేదని తేల్చి చెప్పాడు. ఈ లోగా వివేక్ ఒబరాయ్,అర్షద్ వార్శి నవ్వటం మొదలెట్టారు. చార్మి చిన్నబుచ్చుకుంటే ఆమె సెట్స్ పై కొత్తదనం పోగొట్టుకోవటానికి ఇలా చేసారని చెప్పారు. ఇక గత కొన్నేళ్లుగా సక్సెస్‌లు లేక సతమతమవుతున్న చార్మి కు తెలుగులో ఈ మధ్య వచ్చిన చిత్రాల వరుస ఫెయిల్యూర్స్‌తో అడపాదడపా చిత్రాలు కూడా లేకుండాపోయి, అసలుకే మోసం వచ్చింది.

'మంగళ, దొంగలముఠా, నగరం నిద్రపోతున్న వేళ' వంటి చిత్రాలపై ఆమె పెట్టుకున్న నమ్మకం కాస్తా వమ్మయ్యింది. శ్రీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'సేవకుడు' చిత్రం కూడా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అమితాబ్‌, పూరి కలయికలో వచ్చిన 'బుడ్డా హోగా తేరె బాప్‌' చిత్రంలో హీరోయిన్‌గా కాకపోయినా ఓ ముఖ్యపాత్రను పోషించిన చార్మికి ఆ చిత్రం హిట్‌ కావడంతో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లినా బాలీవుడ్‌లో అవకాశాలు రావడం ఆమెకు కొండంత ఊరటను కలిగిస్తోంది. సంజయ్‌దత్‌, వివేక్‌ ఒబెరాయ్‌ వంటి మల్టీస్టారర్‌తో రూపొందే 'జిల్లా ఘజియాబాద్‌' చిత్రం లో ముఖ్యపాత్రకు చార్మిని ఎంపిక చేశారు. దీనిని కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఎలాగైనా బాలీవుడ్‌లో బిజీ కావాలని భావిస్తోంది.

English summary
Charmi’s co-stars Vivek Oberoi and Arshad Warsi played a prank on her. They said that she needs to shoot with a panther for a scene.Shocked on this, the actress ran to the director to ask him how she would manage with a panther. But soon she realized that it was prank played by her co-stars when she noticed them laughing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu