»   » జ్ఞాపక శక్తి కోల్పోయిన 'ప్రిన్స్‌' కథ

జ్ఞాపక శక్తి కోల్పోయిన 'ప్రిన్స్‌' కథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివేక్‌ ఒబెరాయ్‌ హీరోగా రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్ 'ప్రిన్స్‌'. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో వివేక్ ఓ పెద్ద దొంగ గా కనిపిస్తాడు. అసాధ్యాలను సుసాధ్యం చేయడం అతని అలవాటు...ప్రాణాలకు తెగించడం అతనికి సరదా. ప్రమాదానికే ప్రమాదంలాంటివాడతను. అతడే 'ప్రిన్స్‌'. పేరుకి ప్రిన్స్‌ అయినప్పటికీ అతను పెద్ద దొంగ. అయితే అతని జ్ఞాపకశక్తిని ఎవరో దోచేస్తారు. తనెవరో తెలుసుకోవ డానికి అతను తహతహలాడతాడు. ఒక పక్క పోలీసులు..మరో పక్క మాఫియా..ఇంకోపక్క సీబీఐ అతణ్ని వెంటాడుతుంటాయి. జ్ఞాపక శక్తి కోల్పోయిన కారణంగా తను చేసిన నేరం అతనికి గుర్తుండదు. మరో ఆరు రోజులే అతనికి గడువు. ఆలోపు తనని తాను కాపాడుకోవాలి..ఈ నేపథ్యంలో రాజులాంటి ఆ దొంగ ఏం చేస్తాడు? అనే కథాంశంతో సాగే చిత్రం 'ప్రిన్స్‌'. కూకి వి.గులాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కుమార్‌ తొరాని నిర్మించారు. ఇక వివేక్ ఒబరాయ్...రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రంలో పరిటాల రవిగా చేస్తున్న సంగతి తెలిసిందే.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu