Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమ్మాయిల గురించి అలా మాట్లాడి చిక్కుల్లో పడ్డ కమెడియన్.. దుమ్మెత్తి పోస్తున్నారు!
కొన్ని సార్లు సెలెబ్రిటీలు సరదాకి చేసిన కామెంట్స్ కూడా కాంట్రవర్సీగా మారి వారికి చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. తమిళ కమెడియన్ వివేక్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. అతడు చేసిన ఓ ట్వీట్ పెద్ద చిక్కులు తెచ్చిపెడుతోంది. పలువురు నెటిజన్లు, మహిళలు వివేక్ తీరుని తప్పుబడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇంతకీ ఈ వివాదం ఏంటంటే.. వివేక్ వేదసావి సెలవుల్లో గడుపుతున్న విద్యార్థులని పిల్లలని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఈ వేసవి సెలవుల్లో బాగా ఎంజాయ్ చేయండి. వేసవి కాబట్టి బాగా మంచినీరు తీసుకోండి. అదే సమయంలో అమ్మాయిలు మీ తల్లులకు వంటగదిలో సాయం చేయండి. అలాగే అబ్బాయిలు మీ తండ్రి తో కలసి వెళ్ళండి. మీ కుటుంబం కోసం ఆయన ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం అవుతుంది అని వివేక్ ట్వీట్ చేసాడు.

ఈ ట్వీట్ పై నెటిజన్లు, మహిళలు మండి పడుతున్నారు. మీ మైండ్ సెట్ మారాదా అంటూ వివేక్ కు చురకలు అంటిస్తునారు. అమ్మాయిలు వంట గదికి మాత్రమే పరిమితం కావాలని సలహాలు ఇస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తండ్రి పనిచేసే చోటుకి అబ్బాయిలు మాత్రమే వెళ్లాలా అమ్మాయిలు వంటగదిలో ఉండాలా.. ఇవేం సలహాలు అంటూ ప్రశ్నిస్తున్నారు.