»   »  వైజాగ్ స్టూడియో 17 న

వైజాగ్ స్టూడియో 17 న

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramanaidu
ప్రముఖ నిర్మాత డా .డి.రామానాయుడు వైజాగ్ లో నిర్మించిన స్టూడియో ఈ నెల 17 తేదీన ఉదయం 9:30కు ఓపినింగ్ కానుంది. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దీనిని ఇనాగరేట్ చేస్తారు.అన్నీ అనుకూలిస్తే ప్రస్తుతం ఛార్మీ ,శ్రీకాంత్ ల కాంబినేషన్ లో రామానాయుడు నిర్మిస్తున్న 'కౌసల్యా సుప్రజా రామా' చిత్రం పాటలు అక్కడ చిత్రీకరిద్దామని ప్లాన్ చేస్తున్నారు. మెల్లిమెల్లిగా ఆ స్టూడియో కూడా బిజీ అయితే రాబోయే రోజుల్లో వైజాగ్ కూడా సినీ రాజధానిగా మారే అవకాశం ఉందనేది కొందరి ఆలోచన.

అప్పట్లో చెన్నై నుంచి వచ్చి హైద్రాబాద్ లో సెట్లి అయినట్లుగానే పరిశ్రమ అక్కడకు చేరుతుందని మరికొంతమంది స్టూడియోలు కడతారని మరికొందరి ఉవాచ. అవన్నీ ఎలా ఉన్నా ఈ స్టూడియో వైజాగ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ ఓపినింగ్ విషయాన్ని ఫైనలైజ్ చేసేందుకు రామానాయుడు నిన్న సి.ఎం ను కలిసారని తెలుస్తోంది. అలాగే పది లక్షల రూపాయల చెక్కును ప్లడ్ రిలీఫ్ ఫండ్ కిచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X