»   » 'మనసంతా నువ్వే' వియన్ ఆదిత్య కొత్త చిత్రం టైటిల్ 'రాజ్'

'మనసంతా నువ్వే' వియన్ ఆదిత్య కొత్త చిత్రం టైటిల్ 'రాజ్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుమంత్, ప్రియమణి కాంబినేషన్ లో వియన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి రాజ్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ముందు రిమ్ జిమ్ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత మౌనం అనే టైటిల్ ని కూడా అనుకున్నారు కానీ..ఫైనల్ గా హీరో పైనే టైటిల్ పెట్టాలని రాజ్ కి ఫిక్సయినట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియమణి, సుమంత్ ల మధ్య హాట్ హాట్ లిప్ టు లిప్ కిస్ కూడా ఉంది. అలాగే ఈ చిత్రంలో నాగార్జున హిట్ సాంగ్..భీమవరం బుల్లోడా పాలు కావాలా..మురిపాలు కావాలాని రీమిక్స్ చేస్తున్నారు. ఇక చిత్ర నిర్మాతలు కుమార్ బ్రదర్శ్..నిర్మించిన సాధ్యం చిత్రంలో ప్రియమణి, జగపతి బాబు కాంబినేషన్లో చేసారు. అలాగే నా గర్లెప్రెండ్ బాగా రిచ్ చిత్రాన్ని శివాజీ, కావేరీ ఝాలతో రూపొందించారు. రెండు చిత్రాలకూ కొత్త దర్శకులనే ఎంపికచేసారు. కానీ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చాయి. అలాగే ఈ చిత్రానికి మొదట కొత్త దర్శకుడునే ఎంపిక చేసి ఆ తర్వాత ఆ ప్లేస్ లో వియన్ ఆదిత్యను తీసుకు వచ్చారు. వరస ఫ్లాపుల్లో ఉన్న సుమంత్ ఈ చిత్రాన్ని ఏ మేరకు గట్టెక్కిస్తారో గానీ..ప్రియమణితో మాత్రం రొమాన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడంటున్నారు. ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో విడుదల అయ్యే అవకాసం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu