»   »  పవన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు వాలంటీర్లు కావలెను

పవన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు వాలంటీర్లు కావలెను

Posted By:
Subscribe to Filmibeat Telugu

కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను స్థాపించిన హీరో పవన్ కళ్యాణ్ వాలంటీర్ల రిక్రూట్ మెంట్ ను కూడా ప్రారంభించాడు. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించాడు. తాను స్థాపించిన ఈ ఫోర్స్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా స్పందన అనూహ్యంగా వచ్చిందని ఆయన తెలిపాడు. ఇప్పటికే ఈ సంస్థకు చాలా మంది డొనేషన్లు అందజేస్తున్నారని, అయితే తనకు డొనేషన్ల కన్నా వాలంటీర్లే ముఖ్యమని ఆయన పేర్కొన్నాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఇష్టమున్నవారు సభ్యులు కావచ్చని ఆయన పత్రికా ప్రకటనలో తెలిపాడు. సామాజిక సేవచేయడానికి తనలాగే వాలంటీర్లు కూడా తమ వంతు సేవ చేయవచ్చని ఆయన తెలిపారు. ఒకవేళ డబ్బే కనుక అవసరమైతే ప్రకటన విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X