twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లీన్ క్యాండెట్స్ కే ఓటెయ్యండంటూ స్టార్ హీరో

    By Srikanya
    |

    బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తరుచుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని,క్లీన్ అభ్యర్దులకే ఓటేయండంటూ ప్రచారం ప్రారంభించారు. త్వరలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ సమయంలో ఈ ప్రచారం ప్రజల్లో అవగాహన కలిగిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రచారం అంతా నేషనల్ ఎలక్షన్ వాచ్, అశోషియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వారు మంగళవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో.. అమీర్ ఖాన్ మెసేజ్ ని రికార్డు చేసి అన్ని చోట్లకు పంపుతున్నాము.

    ఆటో మేటడ్ కాల్స్ ద్వారా ఈ మెసేజ్ ని ఓటర్స్ కు వినిపిస్తాము. అలాగే ఒక నిముషం పాటు ఉండే వీడియో క్లిప్ ద్వారా కూడా ఈ మెసేజ్ ని అందిస్తాము. ఈ మెసేజ్..ఇంగ్లీష్,హిందీ భాషల్లో ఉంటుంది. త్వరలోనే రీజనల్ లాంగ్వేజెస్ కు కూడా విస్తరిస్తాము. ఇప్పటికే దీనికి సంభించిందిన పనులు పూర్తయ్యాయి అన్నారు. ఇక ఆ మధ్య అమీర్ ఖాన్.. ఐక్యరాజ్య సమితి భారత్ లో యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ ను ఎంపిక చేశారు. అమీర్ ఖాన్ ను మాత్రమే ఈ సారి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడానికి కారణం....తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్ చిత్రం ద్వారా అమీర్ పిల్లలకు, తల్లిదండ్రులకు చాలా చేరువవ్వడమే అని యునిసెఫ్ ప్రతినిధులు అన్నారు.

    English summary
    Aamir Khan will urge people not to vote for candidates with criminal background in upcoming elections in Uttar Pradesh, Punjab, Uttarakhand, Goa and Manipur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X