»   » ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ట్రైలర్ బావుంది

‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ట్రైలర్ బావుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ట్రైలర్ "Vunnadi Okate Zindagi" Audio And Trailer Released

రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్రవంతి రవికిషోర్‌, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.

హీరో రామ్‌ మాట్లాడుతూ 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమా నా హృదయానికి చాలా చాలా దగ్గరైన సినిమా. దీనికి దేవిశ్రీ, సమీర్‌రెడ్డి, పెద్దనాన్నగారు, డైరెక్టర్‌ కిషోర్‌గారు నాలుగు స్తంభాల్లాగా నిలబడ్డారని తెలిపారు. ఇందులో ఫ్రెండ్‌ ఫిప్‌ అనే ఫ్యాక్టర్‌కు ఆడియెన్స్‌ కనెక్ట్‌ అవుతారు. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానో ఈ సినిమా చేసిన తర్వాత అర్థమైంది. అక్టోబర్‌ 27న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా అందరినీ సినిమా మెప్పిస్తుంది'' అన్నారు.

నాపై పెట్టుకున్న గట్టి నమ్మకం ఈ 'ఉన్నది ఒక్కటే జిందగీ'

నాపై పెట్టుకున్న గట్టి నమ్మకం ఈ 'ఉన్నది ఒక్కటే జిందగీ'

కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ... '' రవికిషోర్‌గారి ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. రవికిషోర్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకం 'నేను శైలజ' సినిమా అయితే, ఆయన నాపై పెట్టుకున్న గట్టి నమ్మకం ఈ 'ఉన్నది ఒక్కటే జిందగీ'. రామ్‌తో నేనుశైలజ చేసేటప్పుడు ఆయనకు దగ్గరయ్యాను. ఈ సినిమాలో ఆయనకు సీన్‌ చెబుతున్నప్పుడే ఆయన పెర్ఫామెన్స్‌ను చూసేశాను. ఒక రైటర్‌గా ఏ క్యారెక్టర్‌ను అయినా ఇతను రాయవచ్చు అనేంత ధైర్యం ఇచ్చిన హీరో రామ్‌. మనమెంత బాగా రాస్తే..తను అవుట్‌పుట్‌ అంత బాగా ఇస్తాడు'' అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ...

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ...

''కిషోర్‌గారితో పనిచేయడం ఎప్పటికీ ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఆయనతో 'నేను శైలజ' సినిమాకు పనిచేశాను. ఆయన డైలాగ్స్‌లో డిఫరెంట్‌ సెన్సాఫ్‌ హ్యుమర్‌ ఉంటుంది అన్నారు.

స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ

స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ

'దర్శకుడు కిషోర్‌ సినిమా కోసం ఏదీ చేసినా తన గుండె లోతుల నుండే చేస్తాడు. దేవిశ్రీ లేకుండా ఈ సినిమా వీలైయ్యేది కాదు. వండర్‌ఫుల్‌ మ్యూజిక్‌ అందించాడు'' అన్నారు.

ట్రైలర్

‘ఉన్నది ఒక్కటే జిందగీ' ట్రైలర్ ఇదే. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Vunnadi Okate Zindagi audio Launch event held in Hyderabad. Vunnadhi Okate Zindagi is an upcoming Telugu drama film starring Ram Pothineni, Anupama Parameswaran and Lavanya Tripathi in the lead roles.The film is written and directed by Kishore Tirumala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu