»   » వివి వినాయక్ కు ఠాగూర్ లో జరిగినట్టే అదుర్స్ లో కూడా...!!

వివి వినాయక్ కు ఠాగూర్ లో జరిగినట్టే అదుర్స్ లో కూడా...!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడిగా వివి వినాయక్ ది గోల్డెన్ లెగ్ అయితే...నటుడిగా గోల్డెన్ లెగ్. 'అదుర్స్" చిత్రంతో ఇది కన్ఫామ్ అయింది. 'ఠాగూర్" లో చిరంజీవి అనుచరుడిగా రెండు నిముషాల పాత్ర అయినా..చక్కగా నటించాడు. తాజాగా అదుర్స్ సినిమాలోని 'శంభో శివ శంభో" పాటలో జస్ట్ రెండు సెకన్లపాటు తెరపైకి వచ్చాడు. ఈ సినిమా విడుదలయిన మొదటి వారంలోనే 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 15 రోజుల్లో 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా పయనిస్తోంది.

విచిత్రమేమంటే, ఠాగూర్ లో నటించమని చిరంజీవి...'అదుర్స్" లో నటించమని జూ ఎన్టీఆర్ పట్టు పట్టారు. తన సినిమాలో నటించకపోతే షూటింగ్ లోంచి వెళ్లిపోతానని ఎన్టీఆర్ బెదిరించాడట! అన్నంతపనీ చేస్తాడని నటించడానికి ఒప్పుకున్నాడు. ఏదైతే ఏమిగానీ..ఆయన నటించిన రెండు చిత్రాలూ హిట్ అయ్యాయి. గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu