»   » ‘అఖిల్’ అలాంటి సినిమా కాదు (వివి వినాయక్ ఇంటర్వ్యూ)

‘అఖిల్’ అలాంటి సినిమా కాదు (వివి వినాయక్ ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్' మూవీ దీపావళి సందర్భంగా ఈ నెల 11న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వివి వినాయక్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. అంతా ఊహిస్తున్నట్లు ఇది ఇది సోషియో ఫాంటసీ చిత్రం కాదు, ఫైట్స్... డాన్స్ ఉన్న మంచి కామెడీ ఎంటర్టెనర్ అన్నారు.

వాస్తవానికి ఈ సినిమా దసర సందర్బంగా విడుదల కావాల్సి ఉంది. అయితే క్లైమాక్స్ సీన్లలో గ్రాఫిక్స్ సరిగా లేక పోవడంతో వేరే సంస్థతో గ్రాఫిక్స్ మళ్లీ చేయించారట. ఈ విషయమై వివి వినాయక్ స్పందిస్తూ... సినిమా క్లైమాక్స్ లో సరిగా రాలేదని అనిపించింది. నాగార్జున గారు కూడా ఆ సీన్ చూసి ‘సినిమా అంతా బాగానే ఉంది..ఈ పది నిమిషాల కోసం ఎందుకు కాంప్రమైజ్ కావాలి' అన్నారు. అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత సినిమాను పోస్టుపోన్ చేసాం. చివరకు డి.క్యు అనే సంస్థ సపోర్టుతో క్లైమాక్స్ ను మంచి క్వాలిటీతో రెడీ చేసామె తప్ప ఎక్కడా రీ షూట్ చేయలేదు అన్నారు.


దసరాకు సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు డిసప్పాయింట్ అయిన మాట నిజమే. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే సినిమా వాయిదా వేసాం. ఈ విషయాన్ని నాగార్జున కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నాం. సినిమా చూసిన తర్వాత అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు. టాలీవుడ్లో అఖిల్ బిగ్గెస్ట్ డెబ్యూ మూవీ అవుతుంది అన్నారు.


ఆఫ్రికా ఖండానికి సంబంధించిన కథ..

ఆఫ్రికా ఖండానికి సంబంధించిన కథ..

సినిమాకు ‘అఖిల్' అనే టైటిల్, ‘పవర్ ఆఫ్ జువా' అనే ట్యాగ్ లైన్ పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. అఖిల్ అంటే యూనివర్సల్ అని అర్థం. భూ మధ్యరేఖ వద్ద ఉన్న ఆఫ్రికా ఖండంలో ఒక తెగ ప్రజలకు సంబంధించిన కథే ‘అఖిల్'. అక్కడి ప్రజలు సూర్యుడిని ‘జువా' అంటారు. ఈ కథకు ఆ ప్రాంతానికి లింకు ఉంది కాబట్టే పవర్ ఆఫ్ జువా అనే ట్యాగ్ లైన్ పెట్టాం అన్నారు.


అఖిల్ ఇరగదీసాడు...

అఖిల్ ఇరగదీసాడు...

అఖిల్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీసాడు. తెలుగు తెరకు మరో పూర్తి స్థాయి కమర్సియల్ హీరో దొరికాడు. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా అఖిల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నారు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఇంత హై ఎక్స్ పెక్టేషన్స్ తో అఖిల్ పై చాలా ప్రెషన్ ఉంది. అఖిల్ లో అవన్నీ తట్టుకోగల కెపాసిటీ ఉంది అన్నారు.


హార్డ్ వర్క్

హార్డ్ వర్క్

అఖిల్ లో కష్టపడే తత్వం బాగా ఉంది. ఫస్ట్ సాంగు కోసం, ఫైట్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. భవిష్యత్తులో పెద్ద హీరోగా ఎదుగుతాడు అని వినాయక్ చెప్పుకొచ్చారు.


మహేష్, చిరంజీవి గురించి...

మహేష్, చిరంజీవి గురించి...

అఖిల్ సినిమా ఆడియో వేడుకకు మహేష్ బాబు రావడం, డెబ్యూ హీరోలను చూపించడంలో వినాయక్ గారి తర్వాతే ఎవరైనా అని ఆయన ఆనడం సంతోషాన్ని కలిగించింది. మహేష్ గారితో సినిమా చేస్తాను. మంచి కథ కోసం చూస్తున్నాను. సరిపడా కథ దొరికేవరకు వెయిట్ చేస్తాను అన్నారు. చిరంజీవి 150వ సినిమా గురించి మాట్లాడటానికి వినాయక్ నిరాకరించారు.
English summary
Check out VV Vinayak interview about Akhil movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu