For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్ నష్టాలు: వివి వినాయక్ కూడా భరిస్తున్నాడా?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ ను హీరోగా పరిచయం చుస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖిల్'. భారీ బడ్జెట్, భారీ తారాగణం, స్టార్ డైరెక్టర్, స్టార్ నిర్మాత ఇలా అన్నింటిలోనూ భారీ తనం ప్రదర్శించిన ఈ చిత్రం తొలి రోజు ఓపెనింగ్స్ భారీగానే సాధించింది. అయితే ఈ ఆనందం ఒక్కరోజు మాత్రమే మిగిలింది.

  సినిమా చూసిన వారి నుండి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో రెండో రోజు నుండి కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలే మిగిలాయి. ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా నాగార్జున డిస్ట్రిబ్యూటర్లతో రహస్యంగా భేటీ అయి, భవిష్యత్తులో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చే సినిమాలను రిజనబుల్ రేటుకు ఇప్పిస్తానని నాగార్జున మాట ఇచ్చినట్లు సమాచారం.

  కొందరు అఖిల్ మీద నమ్మకం లేక పోయినా వివి వినాయక్ మీద నమ్మకంతో కొన్నారు. కానీ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాక పోవడంతో నష్టాలు తప్పలేదు. తనను నమ్మి సినిమాను కొన్న వారికి వినాయక్ పరిహారం చెల్లించడానికి పూనుకున్నట్లు సమాచారం. వినాయక్ సినిమాలు చాలా కాలంగా విశాఖ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రాంతి పిక్చర్స్ వారికి రూ. కోటి ఇచ్చినట్లు సమాచారం. అలాగే కృష్ణ ఏరియాలో ఓ డిస్ట్రిబ్యూటర్ కు కూడా కొంత చెల్లించినట్లు టాక్. నిర్మాత నుండి రావలసిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను రూ. 3 కోట్లను కూడా వినాయక్ వదలుకున్నాడని వినికిడి.

  VV Vinayak sent compensation for Distributors!

  వినాయక్ తర్వాతి సినిమా ఎవరితో?
  దర్శకుడు వివి వినాయక్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి కథ విషయంలో బాగా నాన్చుతుండటంతో సినిమా ముందుకు సాగడం లేదు. ఆల్రెడీ దర్శకుడు పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం కష్టపడి కొంత సమయం వేస్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

  ఆల్రెడీ ‘అఖిల్' సినిమా ప్లాప్ కావడంతో కాస్త డల్ అయిపోయిన వివి వినాయక్.... చిరంజీవి 150వ సినిమా అవకాశం వస్తుందని ఎదురుచూస్తే విలువైన సమయం కోల్పోతానని గ్రహించినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్టు జూ ఎన్టీఆర్ తో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

  వినాయక్ తో చేయడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్ధమే. అందుకే తారక్ ఇమేజ్ కు తగిన విధంగా ఒక మంచి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడట. అఖిల్ సినిమా తర్వాత రెండు నెలలు గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన వినాయక్ ఇందుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.

  మరో వైపు ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్లో సినిమా వచ్చి చాలా కాలం అయింది. చివరగా వచ్చిన అదుర్స్ మూవీ అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇందులో కామెడీ యాంగిల్, యాక్షన్ యాంగిల్ కలగలిపి మాసివ్ హిట్ అందించాడు వినాయక్. ఈ సారి కూడా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

  English summary
  Akhil Akkineni's debut venture has evenually turned out to be the biggest disaster of recent times which made buyers suffering with 80% of losses. Vinayak has reportedly called up the Kranthi pictures of Visakhapatnam and a distributor from the Krishna district, who have been distributing his films for a long time. Vizag distributor has reportedly got Rs.1 crore from the director. Also it is known that the director paid Rs.3 crores back to the producer from the remuneration he received earlier.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X