»   » మహేష్ బాబు లాగే వివి వినాయిక్ కూడా ...

మహేష్ బాబు లాగే వివి వినాయిక్ కూడా ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జల్సా చిత్రంలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ త్వరలో రిలీజ్ కానున్న ఓ చిత్రంలో వాయిస్ ఓవర్ నేరేషన్ ఇచ్చారు. స్నేహగీతం టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. మధురా శ్రీధర్ దర్శకత్వంలో అంతా కొత్త వారితో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఇక వినాయిక్ ఈ చిత్రంలో సినిమా ఉద్దేశ్యం ఏమిటీ అనేది టైటిల్స్ ముందు ఒక్క నిముషం చెప్పుతారు. ఈ మేరకు వినాయిక్ స్టూడియోకు వచ్చి డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. అలాగే చాలా బాగా వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఏప్రియల్ రెండవ వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వినాయక్ మేనల్లుడు సందీప్ ఈ చిత్రంలో ఓ హీరోగా చేస్తున్నాడు. ఠాగూర్ చిత్రంలో తొలిసారిగా తెరపై కనపడ్డ వినాయిక్ ఆ తర్వాత నేనింతే చిత్రంలోనూ, రీసెంట్ గా రిలీజైన అదుర్స్ పాట లోనూ గెస్ట్ గా కొద్దిక్షణాలు సేపు మెరిసి మాయమయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X