twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రెబల్‌' టైటిల్ సజెస్టు చేసిందెవరంటే...

    By Srikanya
    |

    హైదరాబాద్: ''మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు దశరథ్‌ ''డార్లింగ్‌... 'రెబల్‌' పేరుతో ఓ సినిమా చేయ్‌.. నీకు బాగుంటుంది'' అన్నారు. కొన్ని రోజుల తరవాత వినాయక్‌ కూడా ఫోన్‌ చేసి.. ''తరవాత మాస్‌ కథ ఎంచుకొంటే దానికి 'రెబల్‌' అనే పేరు పెట్టుకో'' అని సలహా ఇచ్చారు. నాకేమో 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమాకే 'రెబల్‌' అని పెట్టేదాం అనిపించింది. కానీ ఆ పేరు ఆ కథకు నప్పదు అని ఆగిపోయా. లారెన్స్‌తో సినిమా చేద్దాం అనగానే దశరథ్‌, వినాయక్‌ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అందుకే ఈ సినిమా పేరు 'రెబల్‌' అని ఫిక్సయిపోయా'' అంటూ 'రెబల్‌' టైటిల్ గురించి చెప్పుకొచ్చారు ప్రభాస్.

    'రెబల్‌' లేటు అవటానికి కారణం చెపుతూ... యాక్షన్‌ ఘట్టాల కోసం చాలా కష్టపడ్డాం. వాటికోసం చాలా రోజులు కేటాయించాం. అందుకే ఆలస్యమైంది అన్నారు. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం చేతిలో దెబ్బలు తిన్నాను. చివర్లో... లేడీ ఫైటర్లతో ఓ పోరాట సన్నివేశం ఉంటుంది. కానీ... ఇవన్నీ కొత్త ఆలోచనల్లో భాగాలే అనుకోవాలి. ప్రతిసారీ... ఒకేలా చేస్తే 'ఏంటిది? రొటీన్‌గానే ఉందే' అంటారు. అందుకే ఓ ప్రయత్నం చేశాం. అభిమానులు అర్థం చేసుకొంటారనే నమ్మకం ఉంది'' అన్నారు.

    అలాగే ''వాణిజ్య విలువలున్న సినిమాల్లో కథ అవసరం పెద్దగా ఉండదు. యాక్షన్‌, పాటలు, వినోదం, కాస్త సెంటిమెంట్‌ ఉంటే సరిపోతుంది. 'రెబల్‌' అలాంటి చిత్రమే'' అంటున్నారు ప్రభాస్‌. 'వర్షం', 'ఛత్రపతి' సినిమాలతో యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకొన్న ప్రభాస్‌ ఆ తరవాత 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమాలతో ప్రేమకథలకు, కుటుంబ చిత్రాలకూ సరిపోతానని నిరూపించారు. ఇప్పుడు మళ్లీ 'రెబల్‌'తో తన శైలిలోకి వెళ్లిపోయారు. ''మొదటి నుంచీ యాక్షన్‌ తరహా కథలనే ఎంచుకొంటున్నాను. అలాంటి కథల్లో ఎలాంటి రిస్కూ ఉండదని నా అభిప్రాయం. అభిమానులకూ అవే నచ్చుతాయి. నిర్మాతలూ సంతోషంగా ఉంటారు. నాకూ కావల్సింది అదే కదా'' అన్నారు.

    English summary
    Prabhas’s ‘Rebel’ released on Friday. Prabhas says that ‘Rebel’ title was suggested by VV Vinayak. At Box office Film gets flop talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X