For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కడియం నర్సరీల్లో దర్శకుడు వి.వి.వినాయక్‌

  By Srikanya
  |

  కడియం : ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ కడియం నర్సరీలను సందర్శించి స్నేహితులు, నర్సరీ రైతులతో సరదాగా గడిపారు. కడియపులంక శ్రీసత్యదేవా నర్సరీ, శ్రీవీరహనుమాన్‌ నర్సరీలను సందర్శించిన ఆయనకు నర్సరీ రైతులు పుల్లా చంటియ్య, మార్గాని సత్యనారాయణలు ఆర్నమెంటల్‌, థాయ్‌లాండ్‌ ప్లాంట్లును అందజేసి స్వాగతం పలికారు. సుమారు రెండు గంటలపాటు నర్సరీ అంతా తిరిగి పలురకాల మొక్కల పెంపకం, పోషణ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. అనంతరం పలురకాల మొక్కలు కొనుగోలు చేసి తీసుకెళ్లారు.

  ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ అసలైన సంక్రాంతి సంతోషాలను ఆస్వాదించాలంటే పండుగ పర్వదినాలను పల్లెల్లోనే గడపాలన్నారు. సమయానుకూలతను బట్టి సాధ్యమైనంత వరకు తాను గోదావరి జిల్లాల్లోనే పండుగలలో గడపడానికి ఇష్టపడతానన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు, మానవ సత్సంబంధాలకు అద్దం పట్టే పండుగలను, తెలుగు భాషను ఎప్పుడూ గౌరవించాలన్నారు. అపుడే భవిష్యత్తు కాలానికి నైతిక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వగలుగుతామన్నారు. కనువిందు చేస్తున్న కడియం నర్సరీలు దేశంలో ఎన్నో అందమైన సుందర ప్రాంతాలకు ధీటుగా నిలిచేలా ఉన్నాయన్నారు.

  తన తాజా చిత్రం 'నాయక్' గురించి చెపుతూ.... 'నాయక్' మేకింగ్ అనేది నాకు మంచి జర్నీ. నేనిష్టపడే, నన్నిష్టపడే రాంచరణ్‌తో ఈ సినిమా చేశా. ఎప్పుడైతే ఓ హీరోకీ, డైరెక్టర్‌కీ మంచి సమన్వయం కుదురుతుందో అప్పుడు మంచి సినిమా వస్తుంది. అలాగే మంచి నిర్మాతలు - దానయ్య, రాధాకృష్ణతో, మంచి టీమ్‌తో షూటింగ్ ఆహ్లాదకరంగా, హాయిగా జరిగిపోయింది. రిలీజ్‌కు ముందు జనం దీన్ని ఓ యాక్షన్ సినిమా అనుకుంటే, రిలీజ్ తర్వాత ఇది మంచి కామెడీ సినిమా కూడా తెలిసింది అన్నారు.

  సాధారణంగా నా సినిమాలెక్కువగా మాస్ ఆడియెన్స్‌కు నచ్చుతాయి. కానీ ఈ సినిమా ఓ వింత అనుభూతి నిచ్చింది. అదేంటంటే - ఇది ఫ్యామిలీస్‌కు కూడా బాగా నచ్చుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా జయప్రకాశ్‌రెడ్డి కేరక్టర్‌ని బాగా ఇష్టపడుతున్నారు. బ్రహ్మానందం డాన్స్ బిట్టయితే వాళ్లకి పిచ్చిపిచ్చిగా నచ్చింది. ఎమ్మెస్ నారాయణ ఎపిసోడ్ అయితే ఆడవాళ్లకి చాలా బాగా నచ్చింది. అందరికీ ఏకపక్షంగా నచ్చింది పోసాని కృష్ణమురళి కేరక్టర్. జనం ఆయన పాత్రని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్ పార్ట్ తప్ప మిగతా సినిమా అంతా నవ్వుతూ ఎంజాయ్ చేశామనీ ఫ్యామిలీ ప్రేక్షకులు అంటున్నారు. యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయ్ అని చెప్పుకొచ్చారు.

  English summary
  The mass hit director V V Vinayak has been going through a string of flops and so he is very determined to score a blockbuster with his new film Nayak. Recently he visited Kadiyam Nursery. Kadiyam located in the Godavari basin is richly fertile, abundantly irrigated and naturally available place for the development of Nurseries.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X