»   » రామ్ సినిమాకు వివి వినాయిక్ వాయిస్

రామ్ సినిమాకు వివి వినాయిక్ వాయిస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ఇప్పుడొస్తున్న ప్రతీ చిత్రానికి ఎవరో ఒక చిత్ర ప్రముకుడో, లేక హీరోనో వాయిస్ ఓవర్ అనేది కంపల్సరీ అయిపోయింది. త్వరలో విడుదల కానున్న కందిరీగ చిత్రానికి ప్రముఖ దర్సుకుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. చిత్రంలో వచ్చే నెగిటివ్ లీడ్ రోల్ పాత్ర ఇంట్రడక్షన్ కు వినాయిక్ చేత ఇలా వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారు. ఇంతకు ముందు కూడా వినాయిక్ తన వాయిస్ ని ఇలా ఇతరుల చిత్రాలకు అరువిచ్చారు. అంతేగాక నేనింతే, ఠాగూర్ వంటి చిత్రాలలో నటించారు కూడా.

ఇక కందిరీగ విషయానికి వస్తే ఈ చిత్రంలో రామ్ హీరోగా చేస్తున్నారు. హన్సిక, అక్ష హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ శ్రీనివాస్ అనే కెమెరామెన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనీ గ్యారెంటీగా హిట్ కొడుతుందని యూనిట్ అంతా విశ్వసిస్తున్నారు. హన్సిక,రామ్ లు గతంలో ఎమ్.ఎస్ రాజు నిర్మించిన మస్కా చిత్రంలో నటించారు. అయితే అంతగా క్లిక్ కాలేదు. అయితే మంచి పెయిర్ గా పేరు వచ్చింది. దాంతో ఈ పెయిర్ ని కంటిన్యూ చేసి హిట్ కొట్టాలని ప్లాన్ చేసారు. కందిరీగ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది.

English summary
Director VV Vinayak has given a voiceover for Ram’s forthcoming film Kandireega, which is slated for a release on 12th August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu