నిజంగా అంత సాడిస్ట్ లా బిహేవ్ చేసాడా
ముంబయి: పారిశ్రామికవేత్త నెస్ వాడియా గతంలో కాలే సిగరెట్లు తన ముఖంపై విసిరారని, గదిలో పెట్టి బంధించారని ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన సినీనటి ప్రీతీ జింతా ఆరోపించారు. మే 30న ముంబయి వాంఖడే స్టేడియంలో తనపై ఆయన దాడికి ముందే ఈ సంఘటనలు జరిగాయని చెప్పారు.
విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోరేందుకు జూన్ 30న ముంబయి పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాను కలిసిన సందర్భంగా ఆయనకు అందజేసిన ఒక లేఖలో ప్రీతి ఈ ఆరోపణలు చేశారు. కొన్నిసార్లు అతను భయంకరంగా ప్రవర్తించేవాడని తెలిపింది. తనను చంపేస్తాడేమోనని ఆందోళన చెందానని పేర్కింది. అతని ఆగడాలను భరించలేక ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అతనికి దూరమయ్యానని ప్రీతిజింటా చెప్పింది.

ప్రతీ జింతా మాట్లాడుతూ... ''నా పట్ల నెస్ వాడియా ప్రవర్తన అంతకంతకూ దుందుడుకుగా, హింసాత్మకంగా మారుతూ వచ్చింది. కాలే సిగరెట్లు నా ముఖంపై విసరడం, నన్ను గదిలో పెట్టి బంధించడం, చేయిచేసుకోవడం లాంటివి జరిగాయి. ఆయన్ను నాకు దూరంగా ఉంచాలని కోరుకొంటున్నా. అప్పుడు నేను మనశ్శాంతితో ఉండగలను. లేదంటో ఏదో ఒక దురదృష్టకరమైన రోజు ఆయన ఆగ్రహోద్రేకంతో నన్ను చంపేస్తారు. ఈ ఆందోళన నన్ను భయపెడుతోంది'' అని లేఖలో ఆమె పేర్కొన్నట్లు ఒక పోలీసు అధికారి వెల్లడించారు.
వేధింపుల కేసు విషయమై తన మాజీ ప్రియుడు నెస్ వాడియాతో కాంప్రమైజ్ అయ్యేందుకు సిద్ధంగా లేరట. ప్రీతిజింతా, నెస్ వాడియా వేధింపుల కేసు నేపథ్యంలో వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ముగ్గురు ప్రయత్నించారట. అయితే, ప్రీతిజింతా మాత్రం అందుకు సిద్ధంగా లేరట. వారి మధ్య రాజీ కుదిర్చేందుకు.. ఇద్దరికీ బాగా తెలిసిన ప్రముఖులు ప్రయత్నాలు చేశారట. కానీ కుదరలేదట.


Click it and Unblock the Notifications