»   » ప్రతిష్టాత్మక వాల్ట్ డిస్నీ తెలుగు సినిమా సిద్ధార్థతో..

ప్రతిష్టాత్మక వాల్ట్ డిస్నీ తెలుగు సినిమా సిద్ధార్థతో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్ధార్థ, శృతి హాసన్ జంటగా ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు తనయుడు జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సూర్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎడ్వెంచర్ ఫ్యాంటసీ సినిమాను ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించనున్నట్టు ప్రకటించింది. యోధా అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రతిష్టాత్మక వాల్ట్ డిస్నీ రూపొందిస్తున్న తొలి తెలుగు సినిమా కావడం విశేషం.

తమిళంలో కూడా డబ్ అవుతున్న ఈ సినిమా మళయాలంలో మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఓ సూపర్ హిట్ అడ్వెంచర్ సినిమా ఆధారంగా రూపొందుతున్నట్టు సమాచారం. ఓ మాంత్రికురాలితో ఓ తొమ్మిదేళ్ల బాలిక చేసే పోరాటమే ఈ సినిమా కథ అని తెలిసింది. ఇందులో కథానాయకుడు ఓ సందర్భంలో చూపు కోల్పోతాడు. ఆ తర్వాత ఆ బాలికకు మాంత్రికురాలి మీద విజయం సాధించేందు ఎలా సాయం అందించాడు అనేది మిగిలిన కథ. ఇందులో మాంత్రికురాలి పాత్రలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న నటిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu