»   » అవసరమైతే జైలుకు వెళ్తా..లాయిర్ తో రావాలి: కూతురు డేటింగ్ విషయంలో షారూఖ్

అవసరమైతే జైలుకు వెళ్తా..లాయిర్ తో రావాలి: కూతురు డేటింగ్ విషయంలో షారూఖ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: సెలబ్రెటీ అయినా మరొకరు అయినా తండ్రి , తండ్రే. తండ్రిగా తమ బిడ్డల గురించి ప్రతీ ఒక్కరికీ కొన్ని ఆలోచలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకు బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ , కింగ్‌ఖానే అతీతుడు కాదు. తన పిల్లల విషయంలోనూ ఆయన అందరు తండ్రుల్లాగే వ్యవహరిస్తాడు.

తెరపై హీరోగా ... అమ్మాయిల వెనక తిరిగి, ప్రేమ అంటూ రచ్చ రచ్చ చేసిన షారూఖ్ నిజ జీవితంలోకి వచ్చేసిరి ఎలా మాట్లాడుతున్నాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఓ హీరో ఎంత సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా షారుక్‌కి తన ముగ్గురు పిల్లలు ఆర్యన్‌, సుహానా, అబ్రామ్‌లకు మించింది ఏమీ లేదంటారు ఆయన.

తన కుటుంబం గురింతి, తన పిల్లల గురించి తన కుమార్తెపై ఎంతప్రేముందో నాలుగు ముక్కల్లో వివరించి చెప్పారు బాద్‌షా. షారుక్‌ నటించిన రయీస్‌ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తన పిల్లలంటే విపరీతమైన ప్రేమను కురిపించే షారూఖ్ ...తాజాగా షారుక్‌ తన కుమార్తె సుహానాతో డేటింగ్‌ చేసే కుర్రాడికి ఉండాల్సిన లక్షణాలేంటో ఫెమీనా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇలా వివరించాడు. ఆ డిటేల్స్ చూసి తోటి స్టార్స్ ...నవ్వుకుంటూంటే ,కుమార్తె సుహానా మా నాన్నకు నేనంటే ఎంత ఇష్టమో అని మురిసిపోతోంది. ఆయన ఏం అన్నారో ఇక్కడ చూడండి.

ఫెరఫెక్ట్ ఫాదర్ లా

ఫెరఫెక్ట్ ఫాదర్ లా

ఏ తండ్రి అయినా తన కుమార్తెను ఎవరో గన్నాయి గాడికి ఇచ్చి చేయటానికి ఇష్టపడడు కదా. తన అల్లుడు కాబోయే వాడు తన కన్నా ఓ మెట్టు ఎక్కువ ఉండాలనే కోరుకుంటాడు. అలాంటి కుర్రాడు కోసమే వెతుకుతాడు. అదే షారూఖ్ చెప్తున్నారు. తన కూతురుని చేసుకునేవాడుకి ఉద్యోగం ఉండాలని.

నాకు ‘నువ్వంటే ఇష్టం లేదు’

నాకు ‘నువ్వంటే ఇష్టం లేదు’

హ..హ..హ..షారూఖ్ ఖాన్ చాలా నిజాయితీగా చెప్పాడు. తన కూతురుతనకే సొంతం అనుకునే ఈ తండ్రి కూడా అందరిలాగే మాట్లాడాడు. తన అల్లుడండే ఇష్టం లేదని చెప్పేసాడు. అదే విషయం చెప్తూ..నాకు ‘నువ్వంటే ఇష్టం లేదు' అన్న విషయం అర్థంచేసుకోవాలి అని క్లారిటీగా చెప్పాడు.

అక్కడే ఉంటా

అక్కడే ఉంటా

మీరేమనుకుంటున్నావు..సుహానాని పడేయటం అంత ఈజీ అనుకుంటున్నారా, అది అంత ఈజీకాదు. ఎందుకంటే...షారూఖ్ స్వయంగా చెప్తున్నారు. తన కుమార్తె ఎక్కడుంటే తను అక్కడే ఉంటానని. అది ఖచ్చితంగా అర్దం చేసుకోవాలని.

ఇదో వింత రూల్

ఇదో వింత రూల్

లాయిర్ ని తెచ్చుకోమంటూ షారూఖ్ ఎందుకు రూల్ పెట్టాడో తెలియటం లేదు. ప్రేమిస్తున్నా నీ కూతురు ని అంటే లాయిర్ ని తెచ్చుకోమని చెప్తాడేంటి. అంటే షారూఖ్ ఏమన్నా గొడవకు సిద్దపడతాడా..ఏమో ఇదేదో వింతగానే ఉందే.

‘నీ సొంతం’ అనుకుంటే నేనూరుకోను.

‘నీ సొంతం’ అనుకుంటే నేనూరుకోను.

షారూఖ్ ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు. తన కూతురే తన ఇంటి యువరాణి అంటున్నారు. ఆమెను వేరే వారు సొంతం అనుకుంటే ఊరుకునేది లేదు అంటున్నారు. ఈ విషయంలో ఆయన తండ్రులందరికీ ప్రతినిధులా కనపడుతున్నారు.

అలా అనేసాడేంటి

అలా అనేసాడేంటి

తను జైలుకు వెళ్లటానికి వెనకాడనని షారూఖ్ అన్నారు. తన కుమార్తె డేటింగ్ విషయంలో ఇలా అంటున్నారంటే..డేటింగ్ చెయ్యబోయే కుర్రాడు చాలా కూల్ గా డీల్ చెయ్యాలన్నమాట. తండ్రిగా తన కుమార్తె విషయంలో ఆయన ఎంత కన్సర్న్ గా ఉన్నారో గమనించండి.

 నేను నీతో అలాగే వ్యవహరిస్తా

నేను నీతో అలాగే వ్యవహరిస్తా

నువ్వు నా కూతురుకి ప్రేమను పంచితే ప్రేమిస్తా..లేదా వేరే రకంగా ఉండాలనుకుంటే నేను నీ పట్ల అలాగే ఉంటా..అంటూ షారూఖ్ చాలా క్లియర్ గా చెప్పాడు. చాలా పొసిసివ్ గా అనిపిస్తున్నాడు కదూ షారూఖ్ ఈ విషయంలో . తండ్రిగా ఆయన్ని చాలా మంది ఇష్టపడతారు ఖచ్చితంగా.

ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే

ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే

నేనెప్పుడూ రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడను వాళ్లు వాళ్ల అమ్మతో ఈ విషయాలు మాట్లాడుతూంటారు. నేను వాటి గురించి చర్చించను. వాళ్లు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్తారు. అయితే వాళ్ల రిలేషన్స్ సినిమాల్లో లాగ ఉండవని మాత్రం చెప్పగలను అన్నారు షారూఖ్.

కూర్చోబెట్టి చర్చిస్తా

కూర్చోబెట్టి చర్చిస్తా

అలాగే నా పిల్లలు నాతో చాలా స్నేహంగా ఉంటారు. నేను నా స్నేహితులతో మాట్లాడినట్లే వారితోనూ మాట్లాడతాను. ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలనకుంటే వారిని కూర్చో బెట్టి చర్చిస్తాను. వాళ్ళతో చాలా సరదాగా ఉంటాను. నా భార్య గౌరి ఎప్పుడూ వారితో ఉంటూ గైడ్ చేస్తూంటుంది అని చెప్పుకొచ్చారు షారూఖ్.

సహకారం ఉంటుంది

సహకారం ఉంటుంది

తన తండ్రి అడుగుజాడల్లోనే తానూ పయనిస్తానని, నటననే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా వెల్లడించారు. ఇందుకు తన తల్లిదండ్రుల సహకారం ఉంటుందని ఆమె పేర్కొంది.

నాన్నలాగే..

నాన్నలాగే..

ఈ అమ్మాయికి ఫుట్‌బాల్ అంటే ప్రాణం. ఈమధ్యే స్కూల్ టీమ్‌కి కెప్టెన్ అయి ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది. సుహానా టైక్వాండో కూడా నేర్చుకుంటున్నది. అథ్లెటిక్స్‌లో ఆసక్తి ఉంది. తండ్రిలా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నదట. ఇప్పటికే తన కెరీర్‌ గురించి ఇప్పటికే తన తండ్రితో చర్చించానని, భవిష్యత్తు లక్ష్యంపై ఇప్పుడే నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

విదేశాలకు వెల్తా

విదేశాలకు వెల్తా

తన తండ్రి తనను ఏక్టింగ్ స్కూల్ లో చేరి భారతీయ, అంతర్జాతీయ సినిమాల గురించి చదువు కోవాలని సూచించారని సుహానా వెల్లడించారు. పాఠశాల విద్యాభ్యాసం పూర్తికాగానే తాను విదేశాలకు వెళ్లి నటన పాఠశాలలో చేరతానని తెలిపారు. బహుశా నటన కోసం అమెరికా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

English summary
Shahrukh Khan's extremely protective about his kids and we simply love that! In an interview with Femina, Shahrukh Khan got candid and laid down seven strict rules for any boy out there, who wants to date his princess Suhana Khan!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu