For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  "వింటున్నవా భరతమాతా" అంటూ కమల్ హాసన్ ట్వీట్ : యుద్దమే చేసేలా ఉన్నారు

  |

  ఇప్పుడు విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మూవీ దీపికా పదుకొనే నటించిన పద్మావతి. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కావాల్సి ఉండగా.. వివాదాల కారణంగా వాయిదా పడింది. అంతేకాదు.. దర్శకుడు భన్సాలీ .. హీరోయిన్ దీపిక తలకు వెల కూడా కట్టేశారు. దీపికా పదుకొనే తలను నరికి తెచ్చిన వారికి 5 కోట్లిస్తామని కొందరంటే.. 10 కోట్లిస్తామని మరి కొందరు పబ్లిక్ అనౌన్స్ మెంట్ చేసేయడం దారుణమైన విషయం. ఇప్పుడీ టాపిక్ పై కమల్ హాసన్ రియాక్ట్ అయ్యారు.

  Padmavathi : Karni Sena Members Vandalise Cinema Hall In Kota Over Trailer Screening
   వింటున్నావా భారతమాతా

  వింటున్నావా భారతమాతా

  మిస్ దీపిక తలను రక్షించాల్సి ఉందని అన్న కమల్.. ఆమె శరీరం కంటే తలకు ఎక్కువ గౌరవం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.'ఆమె స్వేచ్ఛను గౌరవించాలి. దాన్ని ఖండించే హక్కు ఎవరికీ లేదు. చాలా సామాజిక వర్గాలు నా సినిమాలను వ్యతిరేకించాయి. ఏ అంశంలో అయినా అతివాదం కరెక్ట్ కాదు. ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకూ చాలానే మాట్లాడాం. వింటున్నావా భారతమాతా' అంటూ ట్వీట్ చేశారు కమల్ హాసన్.

  మమతా బెనర్జీ

  మమతా బెనర్జీ

  "పద్మావతి' వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.ఆ సినిమాకు మద్దతు గా దీదీ ట్వీట్ చేశారు. ఈ సినిమాపై కొనసాగుతున్న వివాదం దురదృష్టకరమని భావ ప్రకటనా స్వేచ్ఛను నాశనం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ కంకణం కట్టుకోవడం దారుణమని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఇలాంటి హింసాత్మక శక్తులపై పోరాడేందుకు చిత్రపరిశ్రమ మొత్తం కలిసికట్టుగా నిలబడాలని దీదీ సూచించారు.

  సెలబ్రిటీల మద్దతు

  సెలబ్రిటీల మద్దతు

  ఇప్పటికే పద్మావతికి..... సల్మాన్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, ప్రకాష్ రాజ్, కరణ్ జోహర్, రాజ్ కుమార్ రావు వంటి సెలబ్రిటీలు మద్దతు తెలిపారు. తాజాగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేయడంపై పలువురు బాలీవుడ్ సెలబ్రటీలు మండిపడుతున్నారు. శ్యామ్ బెనగల్, రితేష్ దేశ్ ముఖ్, షబానా అజ్మీ, జావెద్ అక్తర్ లు ఈ వివాదంపై స్పందించారు.

   శాంతి భద్రతలను కాపాడలేదా?

  శాంతి భద్రతలను కాపాడలేదా?

  బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు కాకూడదని ఓట్ల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని అక్తర్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని రూపుమాపుతామన్న ప్రభుత్వం...ఒక సినిమా విడుదల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడలేదా? అని ప్రశ్నించారు. దీపికా భన్సాలీల తలలపై నజరానా ప్రకటించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోన్నయూపీ రాజస్థాన్ కేంద్ర ప్రభుత్వాల వైఖరిని ఆయన దుయ్యబట్టారు.

  బాలీవుడ్ అంతా ఏకమై

  బాలీవుడ్ అంతా ఏకమై

  సినిమా విడుదలను అడ్డుకోవడం నటీనటులను బెదిరించడం ఇది తొలిసారేమీ కాదని షబానా అజ్మీ అన్నారు. ఈ సారి పద్మావతి విషయంలో బాలీవుడ్ అంతా ఏకమై ప్రభుత్వం పై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇపుడు తిరగబడకపోతే భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు ఇటువంటి ఇబ్బందులు తప్పవన్నారు.

   బాలీవుడ్ సెలబ్రిటీలు

  బాలీవుడ్ సెలబ్రిటీలు

  గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ ఎఫ్ ఐ) వేడుకలకు అమితాబ్ సహా మిగతా బాలీవుడ్ సెలబ్రిటీలు దూరంగా ఉండి ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలని కోరారు. ఐఎఫ్ ఎఫ్ ఐ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరైన షాహిద్ కపూర్ ఈ వివాదంపై తొలిసారి స్పందించారు.

  సంయమనం పాటించాలి

  సంయమనం పాటించాలి

  ఇప్పటికే ఈ చిత్రంపై వివాదం తారస్థాయికి చేరిందని ఇది ఆవేశకావేశాలకు పోయే సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి సమయాల్లో సంయమనం పాటించాలని త్వరలోనే ఆ చిత్రం విడుదలవుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. దీపిక భన్సాలీలపై కర్ణిసేన కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

  English summary
  Actor Kamal Haasan, who is prepping for a political career, on Tuesday weighed in on the controversy over Bollywood movie Padmavati, saying he wanted the head of Deepika Padukone "saved". His tweet was a response to a shocking comment from a Haryana BJP official on Sunday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X