జూ. ఎన్టీఆర్‌తో మాట్లాడాను... చేస్తానన్నాడు: రామానాయుడు

By Srikanya

హైదరాబాద్ : 'రాముడు-భీముడు' రీమేక్ గురించి ఎన్టీఆర్‌తో మాట్లాడాను. చేస్తానన్నాడు. తను ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. ఈ సినిమాని ఎన్టీ రామారావుగారి కుటుంబానికి చెందినవాళ్లు చేస్తేనే బాగుంటుంది. ఒకవేళ ఈ రీమేక్ కుదరకపోతే.. పాత 'రాముడు-భీముడు'ని కలర్‌లోకైనా మార్చుతాను అన్నారు ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు.

అప్పట్లో అది నలుపు-తెలుపు సినిమా. ఒకవేళ ఇప్పుడు రీమేక్ చేస్తే చక్కగా కలర్లో తీయొచ్చు. కుదరకపోతే.. కనీసం రంగుల్లో అయినా చూసుకుందామని కలర్‌కి మార్చాలనుకుంటున్నాను అని చెప్పారు. ఈరోజు రామానాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ఈ విషయం తెలిపారు.

అలాగే రానా తమ్ముడు అభిరామ్‌ని హీరో గా లాంచ్ చేసే విషయమై మాట్లాడుతూ ... నాకైతే చెయ్యాలనే ఉంది. కానీ సురేష్‌బాబుకి ఇప్పుడే ఇష్టం లేదు. అయితే అభిరామ్ మాత్రం ఎప్పుడెప్పుడు హీరో అవుదామా అని ఎదురు చూస్తున్నాడు . ప్రస్తుతం నేను నిర్మించే సినిమాల నిర్మాణంలో ఇన్‌వాల్వ్ అవుతున్నాడు. ఇదిగో ఇప్పుడు సునిల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'నేనేం చిన్నపిల్లనా?' చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతుంటే వెళ్లాడు. ఈ నెల 14తో అక్కడి షెడ్యూల్ పూర్తవుతుంది అని చెప్పారు.

దర్శకత్వం చేయాలనే కోరిక గురించి చెప్తూ... ఆ కోరిక ఒక్కటే మిగిలి ఉంది. అది నెరవేర్చుకుంటాను. దాంతో పాటు ఇంకో కోరిక కూడా ఉంది. వెంకటేష్, మా పెద్ద మనవడు, చిన్న మనవళ్ల కాంబినేషన్‌లో ఓ సినిమా నిర్మించాలనే ఆలోచన ఉంది. ఈ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మిస్తాడు. దీనికోసం కథ రెడీ చేయిస్తున్నాను. ఇటీవలే ఒక రచయిత కలిశాడు. కథ వినబోతున్నాను. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో చెబుతా అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X