»   » సన్నీ జట్టునే కొనేసింది: ఫుట్సల్ టీమ్ ఫ్రాంచైజీ తీసుకున్న సన్నీ లియోన్

సన్నీ జట్టునే కొనేసింది: ఫుట్సల్ టీమ్ ఫ్రాంచైజీ తీసుకున్న సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు పోర్న్ తారగా విజృంభించి.. ప్రస్తుతం బాలీవుడ్ అందాలతారగా తన ప్రస్థానం కొనసాగిస్తోంది సన్నీలియోన్.బాలీవుడ్ అందాలతారగా పేరుతెచ్చుకున్న సన్నీలియోన్ ఇప్పటికే ఫ్రాగ్రెన్స్ (సెంట్ల) రంగంలో ప్రవేశించి సత్తా చాటుతోంది. ఈ రంగంలో భారత్ లో పెద్ద బ్రాండ్లకు సవాలు విసురుతోంది. తాజాగా ఈ భామ క్రీడారంగంలో కూడా అడుపెడుతోంది. తాజాగా ఈమె కోచి కేంద్రంగా కేరళ కోబ్రాస్‌ అనే ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు ప్రీమియర్‌ ఫుట్సల్‌ తెలిపింది. ఆ జట్టుకు స్వయంగా సన్నీనే ప్రచారకర్తగా వ్యవహరించబోతుంది.

Warm up for Sunny Leone's next Mallu tango

కేవలం ఐదుగురు ఫుట్ బాల్ క్రీడాకారులు మినీ స్టేడియంలో నిబంధనల మధ్య ఫుట్ బాల్ ఆడడమే ఫుట్సల్. ఈ ఆటలో ఫ్రాంఛైజీని కొనుగోలు చేయడం ద్వారా క్రీడారంగంలో అడుగుపెడుతోంది. కోచి కేంద్రంగా కేరళ కోబ్రాస్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ మేరకు ప్రీమియర్ ఫుట్సల్‌ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఒక సీజన్ పూర్తయింది. రెండో సీజన్ సెప్టెంబర్ 15న ముంబైలో ప్రారంభమై 17వ తేదీ వరకు జరుగుతుంది. రెండో‌ రౌండ్ బెంగళూరులో సెప్టెంబర్ 19 నుండి 24 వరకు జరుగుతాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ లు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 1 వరకు దుబాయ్‌ లో జరుగుతాయి. కాగా, కేరళలో సన్నీలియోన్ కు ఉన్న ఫాలోయింగ్ ఈ మధ్య షాప్ ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు బయటపడ్డ సంగతి తెలిసిందే.

English summary
Premier Futsal has announced Bollywood actress Sunny Leone as the co-owner and brand ambassador of Kerala cobras
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu