హాలీవుడ్ సంస్థ నుండి ప్రభుదేవాకు వార్నింగ్

ప్రభుదేవా దర్శకత్వంలో బాబా ఫిల్మ్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం 'యాక్షన్ జాక్షన్'. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సోనూ సూద్, యామీ గౌతమ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమ సంస్థ పేటెంట్ హక్కు కలిగి ఉన్న 'యాక్షన్ జాక్షన్' టైటిల్ వాడటం ఏమిటని వార్నర్ బ్రదర్స్ సంస్థ నోటీసుల్లో ప్రశ్నించింది. వెంటనే ఆ టైటిల్ ఉపసంహరించుకోవాలని, లేకుంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది.
అయితే దీనిపై బాలీవుడ్ నిర్మాతలు తమదైన రీతిలో స్పందించారు. యాక్షన్ జాక్షన్ టైటిల్ ముంబైలోని నిర్మాతల మండలిలోనూ, నిర్మాతల గిల్డ్‌లోనూ నమోదు చేసామని, ఈ టైటిల్స్‌పై ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పే అవకాశం లేదని అంటున్నారు. ఇదే విషయమై వారు వార్నర్ బ్రదర్స్ సంస్థకు వివరణ ఇస్తూ లేఖ రాసినట్లు సమాచారం.
వార్నర్ బ్రదర్స్ సంస్థ 1988లో 'యాక్షన్ జాక్షన్' పేరుతో ఓ హాలీవుడ్ సినిమాను తెరకెక్కించింది. కార్ల వెల్తెర్, షరోన్ స్టోన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. కాగా..గతంలో ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రానికి 'రాంబో రాజ్ కుమార్' అని పేరు పెట్టడం కూడా వివాదాస్పదం అయింది. ఆ తర్వాత ఆ టైటిల్ 'ఆర్...రాజ్ కుమార్' గా మార్చారు.


Click it and Unblock the Notifications











