»   » యంగ్ హీరో మృతి : హత్యా? ఆత్మహత్యా??

యంగ్ హీరో మృతి : హత్యా? ఆత్మహత్యా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన యంగ్ హీరో జంగిల్‌ జాకీ రాజేష్‌ (26) దుర్మరణం చెందాడు. ఆదివారం ఉదయం నగర శివార్లలోని పరసయ్యనహుండిలో మూడో అంతస్తు నుంచి కింద పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. రాజేష్‌ను వెంటనే నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

అయితేఈసంఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భవనం నుంచి జారి పడ్డాడా.. ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజేష్‌ ఇటీవల తీవ్ర మానసిక అస్వస్థతకు లోను కావడం గమనార్హం. జిల్లాలోని నాగరహొళె కాకనకోట విభాగంలోని గిరిజన తండాకు చెందిన రాజేష్‌ ప్రైవేట్‌ ఛానల్‌ నిర్వహించిన 'హళ్లి హైద ప్యాటెకె బంద' రియాలిటీ షోతో కన్నడ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

ungle Jackie Rajesh

అందులో రాజేష్‌ అభినయం అందరినీ ఆకట్టుకుంది. జంగిల్‌ జాకీ సినిమాలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. రియాలిటీ షోలో జంటగా నటించిన రాజేష్‌, ఐశ్వర్యలే జంగిల్‌ జాకీలో కూడా జంటగా నటించారు. రెండేళ్లుగా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. చివరకు గత సెప్టెంబరు 20న విడుదలైనప్పటికీ ప్రేక్షకాదరణను నోచుకోలేదు. దీంతో మానసిక అస్వస్థతకు గురయ్యాడు.

అప్పట్లో రాజేష్‌ను పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌, చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సాంత్వన పలికి.. ఆత్మస్త్థెర్యాన్ని కల్గించారు. ఆరు నెలలుగా నగర శివార్లలోని పరసయ్యనహుండి గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తున్నాడు. జంగిల్‌ జాకీ తరువాత లవ్‌ఈజ్‌ పాయిజన్‌ సినిమాలో అవకాశం లభించింది.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సోమవారం నుంచి డబ్బింగ్‌ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించగా ఈ హఠాత్పరిణామం చోటుచేసుకుందని దర్శకుడు నందన్‌ ప్రభు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదవశాత్తు జారిపడ్డాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలోదర్యాప్తు చేస్తున్నారు.

English summary
Actor Rajesh, hailing from a tribal background and popularly known as ‘Jungle Jackie’ died on the afternoon of Sunday November 3 after falling off the third floor of the building in Parasayyana Hundi here where he lived.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu