For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవునూ...ఈ సారి ఏం పీకాడు...(వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: అమీర్‌ఖాన్‌, అనుష్కశర్మ జంటగా తెరకెక్కిన హిందీ చిత్రం 'పీకే'. రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకుడు. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు 'పీకే' చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ టీజర్‌లో అమీర్‌ఖాన్‌ గెటప్‌లు, హావభావాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఫస్ట్ లుక్ లోనే సంచలనం సృష్టించిన పీకే ఈ సారి టీజర్ తో ఈ పీకాడు అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో సరదాగా జోక్స్ కట్ చేస్తున్నారు. ఈ టీజర్ ఇప్పటికీ చూడకపోతే చూసేయండి మరి.

  ఇక క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 19 నుంచి 'పీకే' థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో అమీర్‌ ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపిస్తున్నట్టు ముందే తెలిసినా, ఇప్పుడు పోస్టర్‌ విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేశాడు అమీర్‌. ఇంతకీ ఎలా ఉన్నాడు? ఒంటిపై దుస్తులు లేకుండా రైలు పట్టాలపై అడ్డంగా నుంచుని తీక్షణంగా చూస్తున్నాడు. చేతిలో ఓ టూ ఇన్‌ వన్‌ను అడ్డం పెట్టుకున్నాడు కూడా. తన మూడు దశాబ్దాల సినీ జీవితంలో అమీర్‌ ఇలాంటి అవతారంలో కనిపించడం ఇదే తొలిసారి. ఆన్‌లైన్లో ఈ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఈ టీజర్ తో క్రేజ్ ని క్యూరియాసిటీ ని మరింతగా పెంచేసాడు.

  మరో ప్రక్క ''నేనెలా ఉన్నానో తొందరగా చెప్పండి. తెగ కంగారుగా ఉంది'' అంటున్నాడు అమీర్‌ఖాన్‌. 'పీకే'లో తన కొత్త గెటప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి అభిమానుల అభిప్రాయాలను కోరాడు. అప్పుడు కరణ్‌ జోహార్‌ స్పందిస్తూ ''అద్భుతంగా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది'' అని ట్వీట్‌ చేశాడు. ''పిచ్చెక్కిపోతోంది. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం'' అంటూ విశాల్‌ దద్లానీ వ్యాఖ్యానించాడు. ఈ స్పందనలను చూశాక అమీర్‌ మళ్లీ ట్వీట్‌ చేస్తూ, ''గ్రహాంతర వాసా? ఆది మానవుడా? తాగుబోతా? అబ్బో... ఇలా చాలా రకాలుగా ఊహిస్తున్నారు. హ..హ్హ...హా... చాలా ఆనందంగా ఉంది'' అని రాశాడు.

  ఇంతకీ ఈ పాత్ర ఏమిటనే విషయాన్ని త్వరలోనే బయటపెడతారట. ఈ ఏడాది డిసెంబర్‌19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి రాజ్‌కుమార్‌ హిరాని దర్శకత్వం వహిస్తున్నారు.

  WATCH: Aamir Khan's 'PK' teaser trailer

  ‘పీకే' సినిమా విషయానికొస్తే.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు.

  అలాగే అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన కిస్సింగ్ సీన్లో నటించి రికార్డు సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అమీర్ ఖాన్ ఈ ముద్దు సీన్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. వయసులో తనకంటే సగం వయసు ఉన్న అనుష్క శర్మతో అమీర్ ఖాన్ ఈ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్లో నటించడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్‌ ఇదే అని అంటున్నారు.

  English summary
  Aamir Khan unveiled the teaser of his forthcoming film "PK" on Diwali and the superstar hopes the movie tastes success.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X