»   » అఖిల్... యాక్షన్ సీన్లు ఇరగదీసాడు (మేకింగ్ వీడియో)

అఖిల్... యాక్షన్ సీన్లు ఇరగదీసాడు (మేకింగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అక్కడ పలు కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. స్పెయిన్ షెడ్యూల్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో చిత్ర నిర్మాత నితిన్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు.

దర్శకుడు వినాయక్ అఖిల్‌ను ఈ చిత్రంలో యాక్షన్ హీరోగా చూపించబోతున్నాడని ఈ మేకింగ్ వీడియో చూస్తే స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ నుండి మాస్ ఇమేజ్ ఉన్న హీరో అంటూ లేడు. అందుకే అఖిల్‌ను మాస్ హీరోగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil Debut Movie Making Video of Spain Schedule released. The Movie is written by Veligonda Srinivas and directed by V. V. Vinayak. The film is being produced jointly by actor Nithiin and his father Sudhakar Reddy on Sreshth Movies banner, features Akhil Akkineni and Sayesha Saigal (grand niece of legend actor Dilip Kumar) in lead roles marking their debut as lead actors in Telugu cinema. Anup Rubens & S. Thaman together composed the film's music.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu