»   » యాంకర్ రేష్మి దగ్గర పాలు లేవు(వీడియో)

యాంకర్ రేష్మి దగ్గర పాలు లేవు(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారబాద్: చిత్రం ప్రమోషన్ కోసం ఎంతకైనా దిగజారే పరిస్దితులు ,రోజులు వచ్చేసాయి. అందుకోసం ఆర్టిస్టులు కూడా సిగ్గుపడటం లేదు. ఏదో విధంగా పబ్లిసిటీ జరిగితే చాలు అనుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా జబర్దస్త్ యాంకర్ రష్మి అలాగే తన తాజా చిత్రం ‘గుంటూరు టాకీస్' ప్రమోషన్ లో రెచ్చిపోయింది. ఈ చిత్రం మేకింగ్ వీడియో తరహాలో విడుదల చేసిన వీడియోలో అది మీరు గమనించవచ్చు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


రేష్మి చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. చందమామకథలు చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విలక్షణ కథాంశాలకు సున్నితమైన భావోద్వేగాల్ని జోడించి సినిమాల్ని తెరకెక్కించే ఈ దర్శకుడు ఈ సినిమాలో కూడా తనదైన మార్కు చూపించబోతున్నానని చెప్తున్నాడు.


‘గుంటూరు టాకీస్' సినిమా పేరుతో ఆర్‌కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్దూ, నరేష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తుండగా హీరోయిన్‌లుగా శ్రద్ధాదాస్, జబర్దస్త్ యాంకర్ రశ్మీ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో మహేష్ మంజ్రేకర్, రఘుబాబు, వెంకట్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


Watch Guntur Talkies Comedy Video Paal'lev.

దర్శకుడు మాట్లాడుతూ ''చందమామ కథలు తరవాత చేస్తున్న చిత్రమిది. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అందుకే నాపై మరింత బాధ్యత పెరిగింది. ఓ సామాజిక స్పృహతో తెరకెక్కుతున్న చిత్రమిది. సందేశంతో పాటు వినోదమూ ఉంటుంద''న్నారు. ''ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.


లక్ష్మీ మంచు, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, అపూర్వ తదితరులు నటిస్తున్నారు.ఛాయాగ్రహణం: రామిరెడ్డి.పి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల

English summary
After the stupendous applause he received for “Chandamama Kathalu”, Praveen moved to his next project which is titled as “Guntur Talkies”.Watch Guntur Talkies Comedy Video Paal'lev. After winning the National Award, Praveen Sattaru is coming up with a rather unusual comedy called Guntur Talkies.
Please Wait while comments are loading...