»   » విజువర్స్ అద్బుతం: మణిరత్నం,కార్తి ''చెలియా'' ట్రైలర్ చూసారా?

విజువర్స్ అద్బుతం: మణిరత్నం,కార్తి ''చెలియా'' ట్రైలర్ చూసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'నువ్వు నన్ను ప్రేమించిన దానికంటే నేను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తా. నువ్వు ద్వేషించినా ప్రేమిస్తా, నువ్వు ఇష్టపడకపోయినా ప్రేమిస్తా'.. అంటున్నారు హీరో కార్తీ. ఆయన హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన 'చెలియా' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. అందులో కార్తీ , హీరోయిన్ అదితిరావు హైదరిపై తనకున్న ప్రేమను ఈ విధంగా తెలుపుతూ కనిపించారు.

మణిరత్నం, కార్తీ, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'కాట్రు వేళయిదై'. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై చెలియా అనే టైటిల్ తో విడుదల చేయనున్నాడు.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. పైలట్‌, డాక్టర్ కి మధ్య చిగురించిన ప్రేమ కథే ఈ చిత్రం. త్వరలో 'చెలియా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏప్రిల్ 7న సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుండ‌గా తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు చిత్రాన్ని ప్రేక్ష‌కులు ముందుకు తీసుకువ‌స్తున్నారు. 'చెలియా' సినిమాకు డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు . అలాగే ఈ చిత్రానికి బర్ఫీ, తమషా మరియు గోలియోన్ కీ రాసలీలా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రవివర్మన్ ఈ చిత్రానికి పని చేస్తున్నాడు.

English summary
The official theatrical trailer of 'Cheliyaa' is released and one cant get enough of those breathtaking visuals. Cheliyaa will hit screens on April 7, 2017. Dil Raju is releasing the Telugu version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu