»   » ‘సాహో’ అబుదాబి యాక్షన్ మేకింగ్ వీడియో.... ప్రభాస్ ఒళ్లు గగుర్బొడిచే స్టంట్స్!

‘సాహో’ అబుదాబి యాక్షన్ మేకింగ్ వీడియో.... ప్రభాస్ ఒళ్లు గగుర్బొడిచే స్టంట్స్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Shades Of Saaho Chapter 1 On Prabhas Birthday

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్పైజ్ ఇవ్వబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ సర్‌ప్రైజ్ రానే వచ్చింది. 'సాహో' చిత్రానికి సంబంధించి అబుదాబిలో చిత్రీకరించిన యాక్షన్ సీన్లకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

  హాలివుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ సమక్షంలో సన్నివేశాలు చిత్రీకరించారు. 'షేడ్స్ ఆఫ్ సాహో' చాప్టర్ 1 పేరుతో విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో అభిమానులను అబ్బురపరుస్తోంది. దాదాపు రూ. 90 కోట్ల ఖర్చుతో ఈ యాక్షన్ సీక్వన్స్ చిత్రీకరించినట్లు సమాచారం.

  సాహో కొత్త పోస్టర్.. కేక పెట్టించేలా ప్రభాస్ లుక్.. బర్త్ డే కానుక ఏంటంటే!

  60 రోజుల ప్రిపరేషన్

  60 రోజుల ప్రిపరేషన్

  అబుదాబిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ అండ్ టీం 60 రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్ మొదలు పెట్టారు. ఈ భారీ చేజ్‌ కోసం సుమారు 37 కార్లు, 5 భారీ ట్రక్కులను షూటింగ్‌లో భాగంగా క్రాష్‌ చేశారట.

   30 రోజుల షూటింగ్

  30 రోజుల షూటింగ్

  అన్ని సిద్ధమయ్యాక దాదాపు 30 రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. దుబాయ్‌లో లొకేషన్స్‌ చూశాక కెన్నీ బేట్స్‌ యాక్షన్స్‌ సీన్స్‌లో ఎక్కువ పోర్షన్‌ రియలిస్టిక్‌గా షూట్‌ చేద్దాం అని డిసైడ్‌ అయ్యారట.

   గాల్లో ఎగిరే కార్లనీ రియల్

  గాల్లో ఎగిరే కార్లనీ రియల్

  ఈ యాక్షన్ సీక్వెన్స్ 90 శాతం స్క్రీన్‌ మీద చూపించేదంతా రియాల్టీనే. ఇందులో చూపించే కార్లు గాల్లో ఎగరడం రియల్‌గా చేసినవే. సాధారణంగా అయితే 70 శాతం సీజీ. 30 శాతం రియల్‌ ఉంటుంది. ‘సాహో' యాక్షన్ సీక్వెన్స్ విషయంలో మాత్రం ఎక్కువ శాతం రియాల్టీగా షూట్ చేశారు.

  హాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా... డూప్ లేకుండా ప్రభాస్

  హాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా... డూప్ లేకుండా ప్రభాస్

  హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టారు. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో ప్రభాస్ బైక్ మీద వేగంగా దూసుకెళుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఇది కూడా ప్రభాస్ ఎలాంటి డూప్ లేకుండా చేసినవే.

  శ్రద్ధా కపూర్ స్టంట్స్

  శ్రద్ధా కపూర్ స్టంట్స్

  ఈ చిత్రంలో హీరయిన్‌గా నటిస్తున్న శ్రద్ధా కపూర్ కూడా యాక్షన్ సీన్స్ చేసినట్లు మేకింగ్ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. ఈ సినిమా కోసం ఆమె చిత్రీకరణకు ముందే స్టంట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు.

   చివర్లో ప్రభాస్ స్టైల్ అదుర్స్

  చివర్లో ప్రభాస్ స్టైల్ అదుర్స్

  మేకింగ్ వీడియో చివర్లో ప్రభాస్ బైక్ మీద వెలుతున్న స్టైల్ అదిరిపోయే విధంగా ఉందంటున్నారు అభిమానులు. ఈ మేకింగ్ వీడియో తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠ మరింత పెరిగింది.

  సాహో

  సాహో

  సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌. ఎవలిన్‌ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ 2019లో థియేటర్లలోకి రానుంది.

  షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1


  షేడ్స్ ఆఫ్ సామో చాప్టర్ 1 పేరుతో విడుదలైన మేకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

  English summary
  Chapter 1 of The Shades of Saaho. #Saaho The Multi-Lingual Indian Movie ft. Rebel Star Prabhas and Shraddha Kapoor, Directed by Sujeeth and Produced by Vamsi, Pramod and Vikram under UV Creations. This Video Has The Making Of Abu Dhabi Schedule Featuring The Action Choreographer Kenny Bates. Music For This Video Has Been Composed By Thaman S While The Music For The Movie Has Been Composed By Shankar Ehsaan Loy.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more