»   » సందీప్ కిషన్ కు మూడు చిక్కులు, రెండు ప్రేమలు..?

సందీప్ కిషన్ కు మూడు చిక్కులు, రెండు ప్రేమలు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్ని ప్లాఫ్ లు వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నాడు సందీప్ కిషన్. తాజాగా ఆయన హీరోగా మరో చిత్రం తమిళ,తెలుగు భాషల్లో రెడీ అవుతోంది. సందీప్ , రెజీనా జంటగా ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తమిళ, తెలుగు భాషల్లో నిర్మించిన 'నగరం' సినిమా ట్రైలర్ విడుదలైంది. సందీప్ కిషన్ వెరైటీ లుక్ తో ఆకట్టుకోవటం.... నాలుగు బతుకులు, మూడు చిక్కులు, రెండు ప్రేమలు అంటూ ట్రైలర్ లో చూపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడవచ్చు.


సందీప్ కిషన్ సినిమాల్లో ఓ మంచి ఎంటర్‌టైనర్‌గా 'నగరం' ఉంటుందని నమ్ముతున్నామని నిర్మాత అశ్వనీకుమార్ సహదేవ్ అన్నారు. అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుందని మరో నిర్మాత రాజేశ్ దండా చెప్పారు. లోకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్, రెజీనాల మధ్య ఉండే కొన్ని కీలక సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం జావేద్‌ అందిస్తున్నారు.


Watch Sundeep Kishan Nagaram Movie Trailer Released

మరో ప్రక్క సందీప్ కిషన్, రెజీనా కాంబినేషన్ లో క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశి 'నక్షత్రం' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. సుదీప్, కాజల్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం.

English summary
The Trailer of the upcoming movie of Sundeep Kishan, Regina Cassandra starred ‘Nagaram‘ is released.Nagaram is a Bilingual thriller film which is directed by Lokesh Kanagaraj and produced by S R Prabhu under the banner of Potential Studios whose earlier movie was Mayuri(2015).Nagaram is titled as Maanagaram in Tamil.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu