For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సింగం అద్దిరిపోయింది.. ఈమధ్య కాలం లో ఇలాంటి మోషన్ పోస్టర్ చూసి ఉండరు

  |

  సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన 'సింగం' సీక్వెల్‌ 'సింగం 3' షూటింగ్‌ పూర్తి అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో సెట్స్‌ మీదకు వెళ్లిన ఈ మూవీ పది నెలల పాటు చిత్రీకరణను జరుపుకుంది. చెన్నై, హైదరాబాద్‌, వైజాగ్ తదితర ప్రాంతాలలో షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీకి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

  ఈ మూవీ ప్రీక్వెల్‌గా తెరకెక్కిన రెండు భాగాలు మంచి హిట్‌ సాధించడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇందులో సూర్య సరసన అనుష్క, శృతీహాసన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా హారీష్‌ జైరాజ్‌ సంగీతాన్ని అందించారు. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 16వ తేది ప్రేక్షకుల ముందుకు రానుంది.

  సింగం సిరీస్‌లో భాగంగా:

  సింగం సిరీస్‌లో భాగంగా:

  తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం (తెలుగులో యముడు), సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తమిళ్ లో ప్రముఖ నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.

  మోషన్ పోస్టర్:

  మోషన్ పోస్టర్:

  దీపావళి కానుకగా తన కొత్త సినిమా ‘ఎస్-3' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు సూర్య. ఐతే ఇంత పెద్ద పండక్కి సింపుల్‌గా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడమేంటి..? పోస్టర్లో ఏమంత విశేషం ఉంటుంది అని లైట్ తీసుకున్న వాళ్లకు పెద్ద షాకే తగిలింది. ‘సింగం' సిరీస్ ఎంత పవర్ ఫుల్లో ఈ మోషన్ పోస్టర్ కూడా అంతే పవర్ ఫుల్. బహుశా ఇప్పటిదాకా సౌత్ ఇండియన్ సినిమాల్లో ఇంత ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూసి ఉండమంటే అతిశయోక్తి కాదు.

  ఎఫెక్ట్స్ అదిరిపోయాయి:

  ఎఫెక్ట్స్ అదిరిపోయాయి:

  సింహం 1, 2 రోమన్ అంకెల మీదుగా దూకుతూ రావడం.. దాని పంజానే షూగా మారడం.. ఆ తర్వాత ఖాకీ డ్రెస్సులో సూర్య విగ్రహం.. ముఖంలో సింహం రూపం చూపించడం.. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. మోషన్ పోస్టర్ కోసం ఇంత ఎఫర్ట్ పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. సింగం సిరీస్‌లో మూడో సినిమా ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతోందో ఈ పోస్టరే నిదర్శనం.

  18కోట్లకు అమ్ముడుపోయి:

  18కోట్లకు అమ్ముడుపోయి:

  సూర్య తమిళ కథానాయకుడే అయినా తెలుగు ప్రేక్షకులు ఆయన్ను తమవాడిగానే ఆదరిస్తారు. అందుకే.. ఆయన సినిమాలు తమిళంతో పాటూ తెలుగులోనూ అదే స్థాయిలో విడుదలవుతుంటాయి. ఇక్కడివారి ఆదరాభిమానాలతోనే తన ప్రాజెక్టులు ద్విభాషా చిత్రాలుగా ఉండేలా చూసుకుంటాడు సూర్య. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం సూర్య కొత్త మూవీ భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ‘సింగం-3' ఆంధ్రా-నైజాం రైట్స్ రూ.18కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మల్కాపురం శివకుమార్ ఈ హక్కులను సొంతం చేసుకున్నారని చెప్తున్నారు.

   అనుష్క, శ్రుతి హాసన్:

  అనుష్క, శ్రుతి హాసన్:

  ‘సింగం-3'కి ఇంత రేటు పలకడం ఫిల్మ్ నగర్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. సూర్యకు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలోనే శివకుమార్ ఇంత సొమ్ము వెచ్చించి ఉంటారని అంటున్నారు. సూర్య కెరీర్లో తెలుగులో ఇది హయ్యస్ట్ రేటు. ట్రేడ్ వర్గాలలో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు వచ్చిన హైప్ కారణంగానే ఈ రేటు పలికినట్టు తెలుస్తోంది. హరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క, శ్రుతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

   సిరీస్‌లో ఇప్పుడు మూడో సినిమా :

  సిరీస్‌లో ఇప్పుడు మూడో సినిమా :

  ‘సింగం' సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలతో తమిళ్, తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాడు సూర్య. ఈ సక్సెస్‌ఫుల్ సిరీస్‌లో ఇప్పుడు మూడో సినిమా రాబోతోంది. హరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఎస్-3' షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ప్రకటించేశారు ఫిల్మ్‌మేకర్స్.

   మెజార్టీ పార్ట్ విదేశాల్లోనే:

  మెజార్టీ పార్ట్ విదేశాల్లోనే:

  ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజాతో కలిసి సూర్య స్వయంగా నిర్మించాడు. సినిమా మెజార్టీ పార్ట్ విదేశాల్లోనే ఉంటుందట. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్ కథానాయికలుగా నటించారు. సింగం సిరీస్ తొలి రెండు సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తే... మూడో భాగానికి మాత్రం హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దీపావళికి రావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ కు వాయిదాపడింది. క్రిస్మస్ హాలీడేస్‌కు ముందు రాబోతున్న ఈ చిత్రం సంక్రాంతి పండుగ వరకు తన హవాను కొనసాగించాలనుకుంటోంది.

  దేవిశ్రీ సింగం హమ్మింగ్ మిస్సయింది:

  దేవిశ్రీ సింగం హమ్మింగ్ మిస్సయింది:

  నవంబరు 7న ‘ఎస్-3' టీజర్ రిలీజ్ చేయనున్నట్లు కూడా ఇందులోనే అనౌన్స్ చేశారు. అంతా బాగుంది కానీ.. టీజర్లో తొలి సినిమాల్లో వినిపించిన ట్రేడ్ మార్క్ దేవిశ్రీ సింగం హమ్మింగ్ మిస్సయింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మారిపోయాడు. హ్యారిస్ జైరాజ్ వచ్చాడు. అతను తన స్టయిల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. హరి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్-3'ని సూర్యనే నిర్మిస్తున్నాడు. అనుష్కతో పాటు శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. డిసెంబరు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

  మోషన్ పోస్టర్:

  డిసెంబర్ 16న ఈ చిత్రాన్ని రిలీజ్ కు సిద్ధం చేస్తోండగా, దీపావళి కానుకగా మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు..ఈ మోషన్ పోస్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండగా, అభిమానులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మరి ఈ మోషన్ పోస్టర్ పై మీరు ఓ లుక్కేయండి.

  English summary
  The filmmakers on Friday officially revealed the motion poster of Singam 3 and Suriya is back in khaki.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X