»   »  జిమ్ లో వర్కవుట్లు చేస్తూ కాజల్ అగర్వాల్(వీడియో)

జిమ్ లో వర్కవుట్లు చేస్తూ కాజల్ అగర్వాల్(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కాజల్ రీసెంట్ గా చూసినవారు కాస్త షేప్ అవుట్ అయినట్లు ఫీలయ్యారు. ఆ విషయాన్ని ఆమెకూ చెప్పారు. దాంతో ఆమె తను మళ్లీ పాత రూపానికి రావటానికి వర్కవుట్లు మొదలెట్టింది. ఇదిగో ఈ క్రింద వీడియోలో చూడండి జిమ్ లో ఆమె ఎంత కష్టపడుతోందో..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరయిన్ గా వెలిగిన భామ కాజల్ అగర్వాల్. గత కొంతకాలంగా ఈ సుందరికి తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఇటీవల విడుదలైన టెంపర్‌లో గ్లామర్‌గా కనిపించినా ఫలితం శూన్యం. ప్రస్తుతం ఈ సుందరి తమిళ చిత్రాల్లో బిజీగా వుంది. ధనుష్‌తో మారి, విశాల్‌తో ఓ చిత్రంలో నటిస్తున్న ఆమెకు తాజాగా విక్రమ్ సరసన నటించే అవకాశం లభించింది.

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మర్మ మనితాన్ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా కాజల్‌ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ విక్రమ్ నటనంటే చాలా ఇష్టం. అతనితో కలిసి పనిచేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. నా పాత్రతో పాటు చిత్ర కథ చాలా కొత్తగా వుంటుంది.

ఈ సినిమా తరువాత ప్రత్యేక గీతాల్లో నటించాలనుకుంటున్నాను. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌లంతా ఇప్పుడు ప్రత్యేక గీతాలపై దృష్టిపెట్టారు. తక్కువ సమయం...ఎక్కువ పారితోషికం లభిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆ కోవలోనే త్వరలో కథానాయికగా నటిస్తూనే ప్రత్యేక గీతాల్లో నర్తించాలని నిర్ణయించుకున్నాను అని తెలిపింది.

Watch Video : Kajal Agarwal workout in gym

ఇక ..ఎంతమంది ఎన్ని సినిమాల్లో నటించినా, ఎన్ని పాత్రల్లో మనం ప్రేక్షకులకు గుర్తున్నామో ముఖ్యమని చెబుతోంది అందాల భామ కాజల్. ఏ భాషలో నటిస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నామన్నది ప్రధానం అని చెబుతోంది. ఇటీవల తెలుగు చిత్రాలపై ఆసక్తి లేనట్లుగా కోలీవుడ్, హిందీ చిత్రాలవైపు కాజల్ మొగ్గుతోందన్న మాటలు ప్రతిచోటా వినిపిస్తున్నాయి.

తెలుగులో ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాలన్నింటినీ ప్రేక్షకులు మెచ్చారు. దర్శకులు సరైన అవకాశాలు ఇవ్వడంలేదన్న సాకుతో చెన్నైలో సెటిల్ అయిపోయిందట కాజల్. ఇక కొన్నాళ్లపాటు అక్కడే మంచి సినిమాలు చేస్తానంటోంది. తెలుగులో వస్తున్న కథలు నచ్చకపోవడంతో, చిన్న చిన్న హీరోలతో చేయాల్సి రావడంతో ఆమె అటువైపు వెళ్లిందని సమాచారం.

కోలీవుడ్‌లో అయితే అందరూ పెద్ద హీరోలతోనే అవకాశాలు వస్తున్నాయిట. అందుకే పెద్ద హీరోలైతేనే చేస్తానని చెబుతోంది కాజల్. ప్రస్తుతం విశాల్, ధనుష్, విక్రమ్ చిత్రాలలో ఆమె నటిస్తోంది. ముగ్గురు స్టార్ హీరోలతో ఒకేసారి నటిస్తుండం ఆనందాన్నిస్తోందని చెప్పుకొచ్చింది.

English summary
Kajal Agarwal is working hard to shape up well in the gym. She is sweating out in the gym in order to face the tough competition from her co-stars in the industry. Currently Kajal Agarwal is busy shooting for couple of films in Tamil and Telugu.
Please Wait while comments are loading...