»   » అమితాబ్ బచ్చన్ ‘వాజిర్’ అఫీషియల్ ట్రైలర్ (వీడియో)

అమితాబ్ బచ్చన్ ‘వాజిర్’ అఫీషియల్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమితాబ్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వాజిర్'. ఈ చిత్రానికి విధువినోద్ చోప్రా నిర్మాత. గతంలో ‘సైతాన్' చిత్రాన్ని తెరకెక్కించిన బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉగ్రవాదం నేపద్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఫరాన్ అక్తార్ ఉగ్రవాద నిరోధక అధికారిగా నటిస్తున్నాడు.

 Wazir Official Trailer

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నారు. పొడవాటి జుట్టు, కోరమీసంతో కొత్తగా ఉంది ఆయ న లుక్. ఇందులో అమితాబ్ చిత్రంలో అమితాబ్ పాత్ర ఏమిటనేది సస్పెన్సన్ గా ఉంది.

వీరితో పాటు జాన్ అబ్రహం, నీల్ నితిన్ ముకేష్ కీలక పాత్రలో కనిపిస్తారు. సినిమాను జనవరి 8న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా పర్హాన్ అక్తర్ పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇపుడు విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

English summary
Watch Wazir Official Trailer, starring Amitabh Bachchan, Farhan Akhtar, Aditi Rao Hydari, Neil Nitin Mukesh & John Abraham. The movie set to release on January 8, 2016.
Please Wait while comments are loading...