»   » మేం టెర్రరిస్టులమా? ఆర్ఎక్స్ 100కు... వారి మరణానికి లింకు పెట్టడం కరెక్టా?: కార్తికేయ

మేం టెర్రరిస్టులమా? ఆర్ఎక్స్ 100కు... వారి మరణానికి లింకు పెట్టడం కరెక్టా?: కార్తికేయ

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ఆర్ఎక్స్ 100కు... వారి మరణానికి లింకు పెట్టడం కరెక్టా?: కార్తికేయ

  జగిత్యాల పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌లో ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన కూసరి మహేందర్‌(16), బంటు రవితేజ(16) మద్యం మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలో హీరో అమ్మాయితో ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తానూ చనిపోతానని మహేందర్‌ తన మిత్రులతో చెప్పేవాడని పోలీసుల విచారణలో తేలడంతో.... మీడియాలో 'ఆర్ఎక్స్ 100 స్పూర్తితో విద్యార్థుల ఆత్మహత్య' అంటూ వార్తలు ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ చిత్ర హీరో కార్తికేయ స్పందించారు.

  ‘ఆర్ఎక్స్ 100'ను విలన్‌గా చూపుతున్నారు

  ‘ఆర్ఎక్స్ 100'ను విలన్‌గా చూపుతున్నారు

  ఇటీవల జగిత్యాలలో ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోవడం, దాన్ని ఆర్ఎక్స్ 100 సినిమాలోని ‘పిల్లా రా' సాంగ్‌లో హీరో సూసైడ్ చేసుకున్నట్లు వారూ చేసుకున్నారని, ఆర్ఎక్స్ 100 సినిమాను మీడియాలో విలన్ లాగా చూపించడం జరుగుతోందని కార్తికేయ ఆవేదన వ్యక్తం చేశారు.

  సినిమాలో సూసైడ్ సీన్ లేదు

  సినిమాలో సూసైడ్ సీన్ లేదు

  అసలు ‘ఆర్ఎక్స్ 100' సినిమాలోని ఆ పాటలో ఎక్కడా హీరో సూసైడ్ చేసుకోడు. రెండు రాష్ట్రాలు ఆ పాటను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ, పాడుకుంటూ డాన్స్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే సినిమాలో హీరో ఎక్కడా సూసైడ్ చేసుకోడు. ఇందూ అనే క్యారెక్టర్ హీరోను చంపించడం జరుగుతుంది... అని కార్తికేయ తెలిపారు.

  చనిపోవాలని ఏ ఫిల్మ్ మేకర్ చెప్పడు

  చనిపోవాలని ఏ ఫిల్మ్ మేకర్ చెప్పడు

  ఈ విషయం మా మీద పడ్డ మచ్చను దులుపుకోవడానికి చెప్పడం లేదు. రకరకాల సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి. ఒక సినిమా మిమ్మల్ని ఎంటర్టెన్ చేయడానికే తీస్తారు తప్ప.. ఏ సినిమాలో ఏ ఫిల్మ్ మేకర్, ఏ ఆర్టిస్టూ దీని వల్ల మీరు చనిపోండి, దీని వల్ల మీరు నెగిటివిటీ తీసుకోండి అని ఎవ్వరూ చెప్పరు. ఎవరికీ అలాంటి ఉద్దేశ్యం ఉండదు.... అని కార్తికేయ తెలిపారు.

  అలాంటి వారి మైండ్ సెట్ మార్చాలి

  అలాంటి వారి మైండ్ సెట్ మార్చాలి

  ఇద్దరు పిల్లలు అలా నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారంటే వాళ్ల మైండ్ సెట్ మార్చాల్చిన అవసరం ఉంది. వాళ్లు ఇంకా ఎదగలేదని తెలుస్తోంది. కాబట్టి మన చుట్టూ ఎవరైనా అలాంటి మైండ్ సెట్‌తో కనిపిస్తే వాళ్లను కరెక్ట్ దారిలో నడిపించాల్సిన బాధ్యత ఉంది.

  మమ్మల్ని టెర్రరిస్టుల్లా చూడొద్దు

  ఇంత బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగినపుడు కేవలం ఆర్టిస్టులను, డైరెక్టర్లను టెర్రరిస్టుల్లా చూడటం ఎంత వరకు కరెక్ట్? మమ్మల్ని నెగెటివ్ గా చూడటం మానేసి నెక్ట్స్ టైమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగకుండా మన చుట్టు పక్కన ఉన్న యువతను, పిల్లలను మోటివేస్తారని కోరుకుంటున్నాను... అని కార్తికేయ వ్యాఖ్యానించారు.

  English summary
  "We are artists not terrorists. Lets make sure these situations will not be repeated again keeping an eye on younger generation not to have negative influence of anything." RX100 actor Karthikeya about Jagityala students suicide.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more