twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇన్ని తలలు నరికానన్న పొగరు లేదు, కన్నీళ్లే: వైఎస్ జగన్‌ గురించి పూరి జగన్నాధ్

    |

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ట్విట్టర్లో ఎమోషనల్‌గా స్పందించారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినపుడు నేను వైజాగ్ లో ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కలిసి టీవీ చూస్తూ కూర్చున్నాం. ఎందుకంటే నా తమ్ముడు ఉమాశంకర్ గణేష్ ఎంఎల్ఏ‌గా కంటెస్ట్ చేశాడు. ఎంతో టఫ్ గా ఉంటుందని ఊహించిన మాకు వార్ వన్ సైడ్ అయ్యేసరికి మతిపోయిందని పూరి తెలిపారు.

    ఏపీలో ప్రజలందరూ సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకుని వైఎస్ జగన్‌కే గుద్దేద్దాం అని అందరూ కూడబలుక్కుని గుద్దేసినట్లు ఉంది. ఇన్నికోట్ల మంది ఒకేసారి ఒక మనిషిని నమ్మడం, అతడు వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్న విషయం కాదు. హాట్సాఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారంటూ ప్రశంసలు గుప్పించారు.

    రాజ్యం పోయింది. అందరూ మోసం చేశారు

    రాజ్యం పోయింది. అందరూ మోసం చేశారు

    కొండ లాంటి తండ్రి రాజశేఖర్ రెడ్డి పోయిన తర్వాత తను వంటరివాడయ్యాడు. రాజ్యం పోయింది. అందరూ మోసం చేశారు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఇన్నీ తట్టుకుంటూ శక్తిని కూడగట్టుకుని ఎన్నికలకు వెళితే ఘోర పరాజయం.. ఎన్నో కేసులు, ఎన్నో నెలల జైలు జీవితం.. తన తండ్రి పేరు నిలబెట్టాలన్నా, మళ్లీ రాజన్న రాజ్యం తీసుకురావాలన్నా మరో ఐదేళ్లు ఎదురు చూడటం.. ఎంత కష్టం?

    పదేళ్ల యుద్ధం.. ఒళ్లంతా గాయాలతో, రక్తం కారుతున్నా

    పదేళ్ల యుద్ధం.. ఒళ్లంతా గాయాలతో, రక్తం కారుతున్నా

    జగన్మోహన్ రెడ్డిగారు చేసింది ఒకే రోజు ఎలక్షన్ కాదు.. పదేళ్ల యుద్ధం.. ఒళ్లంతా గాయాలతో, రక్తం కారుతున్నా పట్టించుకోకుండా, శక్తి కోల్పోకుండా తన సైనికుల్లో ఉత్సాహం నింపుతూ.. రాజన్న ఎత్తున్న తల్వార్ పట్టుకుని పదేళ్ల పాటు యుద్ధం రంగంలో నిల్చున్న యోధుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

    ఇన్ని తలలు నరికానన్న పొగరు లేదు

    విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో చూశాను. అతడి మోహంలో విజయం గర్వం లేదు, ఇన్ని తలలు నరికానన్న పొగరు లేదు, కామ్ గా ఉన్నాడు. సేద తీర్చుకుంటున్నాడు.. అతడి మొహంలో గెలుచుకున్న సీఎం పదవి కంటే అందరూ అతడిని పొడిచిన కత్తిపోట్లు కనిపించాయి. ఒంటరిగా ఎన్నోసార్లు ఏడ్చిన కన్నీళ్లు కనిపించాయి. వాళ్లింట ఆడవాళ్ల వేదనలు వినిపించాయి. ఏదైనా రాజన్న కొడుకు అనిపించాడు.

    కోట్ల మంది చేతులెత్తి ఎవరిని మొక్కితే వాడే దేవుడు

    కోట్ల మంది చేతులెత్తి ఎవరిని మొక్కితే వాడే దేవుడు

    వైఎస్ జగన్ ఒక వారియర్. దైవ నిర్ణయం, ప్రజా నిర్ణయం వల్ల ఈ విజయం వచ్చిందని ఆయన తన మాటల్లో చెప్పాడు. కానీ ప్రజా నిర్ణయం దైవ నిర్ణయం కంటే గొప్పదని నేను నమ్ముతాను. ప్రజలను మార్చడంలో దేవుడు ఎప్పుడో ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రజలు తలుచుకుంటే దేవుడిని మార్చగలరు. ఇన్ని కోట్ల మంది చేతులెత్తి ఎవరిని మొక్కితే వాడే దేవుడు.. అందరూ కలిసి వైఎస్ జగన్ గారికి ఈ రోజు మొక్కేశారు.

    నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం

    నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం

    నా తమ్ముడికి వైఎస్ జగన్ గారంటే ప్రాణం.. ఆయన ఫోటో చూసినా, వీడియో చూసినా ఎగ్జైట్ అవుతాడు. ఓ సూపర్ స్టార్ లా చూస్తాడు.. వాడలా ఎందుకు చూస్తాడో నాకు ఈరోజు అర్థమైంది. గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా, మళ్లీ భుజం తట్టి, చేయి పట్టుకుని యుద్దంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని వాడికి అందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం. నేను రాజకీయాల్లో లేను, కానీ నాకు వారియర్స్ అంటే ప్రేమ. వైఎస్‌లో నేను మృగరాజును చూసుకుంటున్నాను.

    English summary
    "We are grateful to YS Jaganmohan reddy" Puri Jagannadh comment on YS Jagan Victory.Puri Jagannath is an Indian film director, screen writer and producer, who works primarily in the Telugu cinema. He is a three-time Nandi Award recipient. He is known as the Dynamic Director in Telugu Film Industry for his characterizations and style of movie making.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X